మిత్రుడి కోసం ఆ క‌థ త్యాగం చేసిన హీరో!

మిత్రుడి కోసం ఆ క‌థ త్యాగం చేసిన హీరో!

టాలీవుడ్ లోని విల‌క్ష‌ణ హీరోల‌లో నారా రోహిత్ ఒక‌డు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ జ‌యాప‌జ‌యాల‌తో ప‌నిలేకుండా సినిమాలు చేయ‌డం రోహిత్ నైజం. సామాజిక సందేశం ఉన్న సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో కూడా రోహిత్ ముందుంటాడు. ప్ర‌స్తుతం రోహిత్ న‌టించిన `ఆట‌గాళ్లు` ఈ నెల 24న విడుద‌ల కానుంది. `వీర‌భోగ వ‌సంత రాయలు` షూటింగ్ లో రోహిత్ బిజీగా ఉన్నాడు. అయితే, రోహిత్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. త‌న కోసం వ‌చ్చిన ఓ క‌థ‌ను....రోహిత్ త‌న మిత్రుడి కోసం త్యాగం చేశాడ‌ట‌. ఆ క‌థ తెచ్చిన దర్శ‌కుడిని ఏడాదిపాటు వెయిట్ చేయించ‌డం ఇష్టం లేని రోహిత్....ఓ యంగ్ హీరోను ఆ క‌థ‌కు స‌జెస్ట్ చేశాడ‌ట‌.

హీరోలు త‌మ‌కు వ‌చ్చిన క‌థ‌ను ...ఎన్నిరోజులైనా హోల్డ్ లో పెట్టుకొని ఉండ‌డం చాలా సాధార‌ణ విష‌యం. ఆ ద‌ర్శ‌కుడు కూడా క‌చ్చితంగా స‌ద‌రు హీరో చెప్పినంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే, 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి తెచ్చిన 'బలవంతుడ నాకేమని` కథ రోహిత్ కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. త‌నే స్వ‌యంగా ఆ సినిమాలో న‌టించాల‌ని అనుకున్నాడు.

అయితే, 'వీర భోగ వసంతరాయలు`తో పాటు మరో రెండు సినిమాలు రోహిత్ చేతిలో ఉన్నాయ‌ట‌. మ‌రో ఏడాది త‌ర్వాత రోహిత్ ఫ్రీ అవుతాడ‌ట‌. అంత‌కాలం చైతన్యను వెయిట్ చేయించడం ఎందుక‌ని రోహిత్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అందుకే 'బలవంతుడ నాకేమని' సినిమాకు హీరోగా  శ్రీవిష్ణుని తీసుకోమ్మని సూచించాడట. అంతేకాదు, 'బలవంతుడు నాకేమని` త‌ర్వాత త‌మ కాంబోలో ఓ సినిమా చేద్దామ‌ని ప్రామిస్ చేశాడ‌ట‌. శ్రీ‌విష్ణు, రోహిత్ లు మంచి స్నేహితుల‌న్న సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English