యాడ్ చేసిన స్టార్ హీరో భార్య‌.. తిడుతున్న నెటిజ‌న్లు

యాడ్ చేసిన స్టార్ హీరో భార్య‌.. తిడుతున్న నెటిజ‌న్లు

త‌మ‌కు న‌చ్చినోళ్లు ఏం చేసినా నెత్తిన పెట్టుకొని చూసుకునే అభిమానులు లేరు. త‌ప్పు చేసినోళ్లు ఎంత‌టోళ్లు అయినా విరుచుకుప‌డ‌టం.. తిట్టి పోయ‌టం ఇప్పుడు  మామూలైంది. త‌ప్పు చేసిన వారిని త‌మ ఆరాధ్య దైవాలుగా భావించేందుకు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఏ మాత్రం సిద్ధంగా లేదు. దీనికి నిద‌ర్శ‌నంగా తాజాగా ఉదంతాన్ని చెప్పొచ్చు.

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ స‌తీమ‌ణికి ఇప్పుడు ఇదే త‌ర‌హా అనుభ‌వం ఎదురైంది. ఆమె చేసిన ఒక యాడ్ ఇప్పుడు ర‌చ్చ‌గా మార‌ట‌మే కాదు.. ఆమెను తీరును త‌ప్పు ప‌డుతూ నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఒక ప్ర‌ముఖ సౌంద‌ర్య సాధ‌నాల సంస్థలో ఆమెచేసిన యాడ్ పై వారు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

త్వ‌ర‌లో రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న మీరా.. ఒక టీవీ యాడ్ లో న‌టించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె త‌న సోష‌ల్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఇంత‌కూ ఆమె చేసిన యాడ్ ఏమంటే.. యాంటీ ఏజింగ్ క్రీమ్. త‌ల్లిగా మారినంత మాత్రాన .. మీకు మీరుగా ఉండే హ‌క్కును కోల్పోయిన‌ట్లు కాదుగా.. ఇదిగో ఇదే నా రీబార్న్ స్టోరీ అంటూ ఆమె చేసిన యాడ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌తంలో త‌న చ‌ర్మ సౌంద‌ర్యం కోసం స‌హ‌జ సిద్ధ‌మైన ఉత్ప‌త్తుల‌నే వాడ‌తానంటూ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పిన మీరా.. ఈసారి అందుకు భిన్నంగా యాంటీ ఏజింగ్ క్రీమ్‌కు యాడ్ చేయ‌టం ఏమిట‌ని త‌ప్పు ప‌డుతున్నారు. మీరు గ‌తంలో చెప్పిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. మీరు మాట త‌ప్పుతున్నారంటూ ప‌లువురు ఆమె చేసిన త‌ప్పును గుర్తు చేయ‌టం గ‌మ‌నార్హం.

23 ఏళ్ల యువ‌తి..యాంటీ ఏజింగ్  క్రీమ్‌కు ప్ర‌చారం చేయ‌టం ఏమిటి?  నాన్సెన్స్ అంటూ ఒక‌రు మండిప‌డితే.. ఇలాంటి యాడ్స్ చేసి మిమ్మ‌ల్ని మీరు తగ్గించుకోకండి.. ఇలాంటి ప‌నులు మానుకోండి.. మిమ్మ‌ల్ని చూసి సిగ్గుప‌డుతున్నాం అంటూ త‌లంటుతున్నారు. ప్ర‌ముఖులైన వారు ఏమైనా చేయొచ్చన్న భావ‌న వ‌దిలేసి.. ఆలోచించి అడుగులు వేయాల్సిన కాలం వ‌చ్చేసింది సుమా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English