దగ్గుబాటి రానా సమర్పించు..

దగ్గుబాటి రానా సమర్పించు..

ఈ మధ్య టాలీవుడ్లో ఒక మంచి సంప్రదాయం కనిపిస్తోంది. ఎవరైనా కొత్త వాళ్లు చిన్న స్థాయిలో మంచి సినిమా తీసి విడుదల విషయంలో ఇబ్బంది పడుతుంటే.. వాటిని పెద్ద బేనర్లు టేకప్ చేస్తున్నాయి. సరిగ్గా ప్రమోట్ చేసి.. సినిమాకు బజ్ పెంచి.. థియేటర్లు సమకూర్చి రిలీజ్‌కు సహకారం అందిస్తున్నాయి. ఈ విషయంలో వాళ్లకు దక్కాల్సిన ప్రయోజనం కూడా దక్కుతోంది. మొత్తానికి ఉభయతారకంగా ఉండేలా ఇలాంటి డీల్స్ కుదురుతున్నాయి. ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’.. ‘చి ల సౌ’ లాంటి చిన్న సినిమాలకు ఇలాంటి సపోర్టే దొరికింది. తాజాగా అలా మరో చిన్న సినిమా పెద్ద సపోర్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం పేరు.. కేరాఫ్ కంచెరపాలెం.


ఇంకా వార్తల్లోకి రాలేదు కానీ.. ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇప్పటికే ‘కేరాఫ్ కంచెర్లపాలెం’ చర్చనీయాంశమైంది. అందరూ కొత్త వాళ్లతో వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఒక పల్లెటూరిలో విభిన్న వ్యక్తుల నేపథ్యంలో సాగే భిన్నమైన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. ఇండస్ట్రీ ప్రముఖులు చాలామందికి దీని ప్రివ్యూ వేశారు. అలా ప్రివ్యూ చూసిన వాళ్లలో దగ్గుబాటి రానా కూడా ఒకడు. అతడికి సినిమా బాగా నచ్చేసి తనే సొంతంగా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడు. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌ను పోస్టర్ మీదికి ఎక్కించాడు. దగ్గుబాటి రానా సమర్పించు.. అంటూ తన పేరూ వేయించుకున్నాడు. మామూలుగా సురేష్ బాబే ఇలాంటి బాధ్యతలు తీసుకుంటుంటాడు. కానీ ఈ సినిమాను మాత్రం రానానే టేకప్ చేశాడు. సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే మూణ్నాలుగు వారాల్లో సినిమాను బాగా ప్రమోట్ చేయాలని రానా ఫిక్సయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English