ఏడాదిలో 60 కోట్లు సంపాదించిందట

ఏడాదిలో 60 కోట్లు సంపాదించిందట

ఏమో అనుకున్నాం కానీ.. ప్రియాంక చోప్రా మామూలు అమ్మాయి కాదు. రెండు మూడేళ్లుగా బాలీవుడ్‌కు టాటా చెప్పేసి అమెరికాకే పరిమితం అయిపోయిన ఈ భామ.. అక్కడ భారీగానే ఆదాయం అందుకుంటోందని వెల్లడైంది. గత వార్షిక సంవత్సరంలో ప్రియాంక ఏకంగా రూ.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందట. ఈ మేరకు ఒక బాలీవుడ్ మ్యాగజైన్ ప్రచురించిన కథనం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలీవుడ్‌తో పోలిస్తే అక్కడ ప్రియాంకకు ఎక్కువ ఆదాయమే వస్తుండొచ్చని తెలుసు కానీ.. ఆమె మరీ ఈ స్థాయిలో ఆర్జిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. రెండేళ్ల పాటు ప్రియాంక అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించింది.  దాంతో పాటుగా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ మూవీలోనూ కనిపించింది. వీటికి ఆమెకు భారీగానే పారితోషకాలు అందినట్లు తెలుస్తోంది.

అంతే కాక అంతర్జాతీయ స్థాయిలో ప్రకటనల్లో నటించడం.. వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కూడా ప్రియాంక పెద్ద మొత్తంలో పారితోషకాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలుమార్గాల్లో వచ్చిన ఆదాయమంతా కలిపితే ఏడాదికే రూ.60 కోట్లుగా తేలిందట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమానే ప్రియాంక తిరస్కరించిందే అని మొన్నటిదాకా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ ఆదాయం లెక్కలు చూస్తుంటే ఆమె సల్మాన్ సినిమాను తిరస్కరించడంలో షాకవ్వాల్సిన పని లేదనిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలో నటిస్తే కథానాయికకు గరిష్టంగా పది కోట్లకు మించి పారితోషకం అందదు. పైగా గుర్తింపు తక్కువ. కానీ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తే పారితోషకం పెరుగుతుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అందుకే ఇక బాలీవుడ్ సినిమాలకు ప్రియాంక దాదాపుగా టాటా చెప్పేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో ఇప్పుడు రెండు క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్టులుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English