థియేటర్ల ముందు తోరణాలు.. మేళతాళాలు

థియేటర్ల ముందు తోరణాలు.. మేళతాళాలు

ఈ రోజు రిలీజైన ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ముందు నుంచి దిల్ రాజు చాలా గొప్పగా చెబుతూ వస్తున్నాడు. ఈ సినిమా తన బేనర్లో మరో ప్రతిష్టాత్మక చిత్రమవుతుందని అంటున్నాడు. ‘బొమ్మరిల్లు’ విడుదలైన డేటుకే పట్టుబటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయిస్తున్న రాజు.. ఇది కూడా ఆ స్థాయి సినిమా అవుతుందని కూడా ఆశిస్తున్నాడు. మామూలుగా బడ్జెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించే రాజు... ‘శ్రీనివాస కళ్యాణం’ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దీని విజువల్స్ చూస్తేనే ఆ గ్రాండియర్ ఎలాంటిదో అర్థమైపోతుంది. ఐతే సినిమాకే కాదు.. ప్రమోషన్లకు కూడా రాజు బాగానే ఖర్చు చేస్తున్నాడు. ఈ రోజు ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజైన థియేటర్ల ముందు హంగామా చూస్తే ఆ విషయం అందరికీ అర్థమై ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజైన థియేటర్ల ముందు పచ్చటి తోరణాలతో పందిళ్లు వేయడం విశేషం. అంతే కాదు.. మేళ తాళాలు సైతం ఏర్పాటు చేశారు. వాయిద్య కారులు వచ్చి కాసేపు సందడి చేసి వెళ్లారు. గతంలో ‘అమ్మోరు’ అనే సినిమా రిలీజైనపుడు థియేటర్ల ముందు ఆ చిత్రంలోని అమ్మవారి తరహా ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు జరిపించడం విశేషం. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ థియేటర్ల ముందు హంగామా చూస్తే ఆ దృశ్యాలు గుర్తుకొచ్చాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ పెళ్లి గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా తీసిన కథ. సినిమా అంతా కూడా పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. ద్వితీయార్ధమంతా కూడా పెళ్లి తంతు చుట్టూనే తిరుగుతుంది. చివర్లో పెళ్లి వేడుక నేపథ్యంలోనే ఒక పాటతో సినిమా ముగుస్తుంది. అందుకే థియేటర్ల ముందు ఈ హడావుడంతా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English