సీఎం టు స్టూడెంట్.. వాట్ ఎ మేకోవర్

సీఎం టు స్టూడెంట్.. వాట్ ఎ మేకోవర్

హీరోలు సాధారణంగా కెరీర్ ఆరంభంలో స్టూడెంట్ క్యారెక్టర్లు చేస్తారు. ఆ తర్వాత బరువైన.. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లలోకి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఇప్పుడు దీనికి భిన్నమైన మలుపు తీసుకుంది. మహేష్ గత సినిమా ‘భరత్ అనే నేను’లో అతను ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర వేసేశాడు. మహేష్ వయసుకి.. అతడి ఇమేజ్‌కు ఆ పాత్ర కొంచెం భారమైందే అని చెప్పాలి. కానీ కొరటాల ఆ పాత్రను కన్విన్సింగ్‌గా తీర్చిదిద్ది ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశాడు. ఐతే సీఎంలో కనిపించిన హీరో తర్వాతి సినిమాకే స్టూడెంట్ పాత్రలోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ రోజే రిలీజైన మహేష్ కొత్త సినిమా ‘మహర్షి’ ఫస్ట్ లుక్, టీజర్లలో స్టూడెంట్ అవతారంలో కనిపించి ఆశ్చర్యపరిచాడు మహేష్.

‘మహర్షి’లో మహేష్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా ఇంతకుముందే రూమర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ అలాంటి పాత్ర చేస్తాడా అని సందేహించారు. కానీ అది నిజమే అని ఈ రోజు రుజువైంది. ఏదో మొక్కుబడిగా స్టూడెంట్ పాత్ర చేస్తున్నట్లు కాకుండా అందులో ఒదిగిపోవడానికే మహేష్ ట్రై చేశాడు. సగటు కుర్రాడి లాగే అమ్మాయిల వైపు కొంటెగా చూడటం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎప్పుడూ డీసెంట్ క్యారెక్టర్లు చేసే మహేష్.. ఇలా కనిపించడం విశేషమే. మరి సినిమా మొత్తంలో అతను ఎలా కనిపిస్తాడు.. అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. కేవలం ఒక ఎపిసోడ్ వరకు విద్యార్థి పాత్రలో కనిపిస్తాడా.. మొత్తంగా అతను స్టూడెంటేనా అని చర్చించుకుంటున్నారు అభిమానులు. మొత్తానికి మహేష్ లుక్, క్యారెక్టర్ విషయంలో కనిపించిన మేకోవర్‌తో అభిమానులు సంతోషంగానే ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English