ఎన్టీఆర్ అభిమానుల్ని కూల్ చేశాడు

ఎన్టీఆర్ అభిమానుల్ని కూల్ చేశాడు

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ఈజీగా పాపులర్ కావచ్చు. అదే సమయంలో చాలా వేగంగా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. ఒక చిన్న ట్వీట్ కూడా పెద్ద వివాదాన్నే రాజేస్తుంది ఒక్కోసారి. టాలీవుడ్ యువ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తాజాగా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. అతను జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఒక క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు. షూటింగ్ సందర్భంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ అతను తన ఉద్వేగాన్ని ఫాలోవర్లతో పంచుకున్నాడు. వీళ్లిద్దరితో కలిసి పని చేయాలన్నది తన కల అని.. అది నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని అతనన్నాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ను సర్ అని సంబోధించిన ఆదర్శ్.. ఎన్టీఆర్ పేరు తర్వాత మాత్రం అలాంటి గౌరవ సూచకం ఏమీ పెట్టలేదు.

ఇది కొందరు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఎన్టీఆర్ రేంజేంటి.. నీ రేంజేంటి.. నేరుగా పేరుతో సంబోధిస్తావా అంటూ అతడిని తిట్టడం మొదలుపెట్టారు. ఒక రోజంతా అతడిపై ట్రోలింగ్ నడిచింది. అయినప్పటికీ ఆదర్శ్ తన ట్వీట్‌ను ఎడిట్ చేయలేదు. డెలీట్ చేసి వేరేది పెట్టలేదు. దీంతో ట్రోలింగ్ మరింత పెరిగింది. ఐతే ఈ రోజు ఆదర్శ్ దీనిపై వివరణ ఇచ్చాడు. తారక్  తాను ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి కాపీ చేసి ఈ ట్వీట్ పోస్ట్ చేశానని.. దీంతో ఎన్టీఆర్ ఐడీ అలాగే కాపీ అయి పోస్ట్ అయిందని.. అంతే తప్ప తాను కావాలని ఏమీ చేయలేదని.. కాబట్టి తనను తిట్టడం ఆపాలని అతనన్నాడు. ఇది అంత కూల్ కాదని కూడా చెప్పాడు. తారక్ తనకు ఎప్పుడూ అన్నే అని కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ వివరణతో ఎన్టీఆర్ అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందుతారో.. ఆదర్శ్‌ను మన్నిస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు