మరి దర్శకుడిగా ఎందుకు ఫెయిలయ్యాడు?

మరి దర్శకుడిగా ఎందుకు ఫెయిలయ్యాడు?

రెండే రెండు సినిమాలతో అడివి శేష్ ఇమేజే మారిపోయింది. ‘క్షణం’తో తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చిన శేష్.. ఇప్పుడు ‘గూఢచారి’తో మరోసారి ఆశ్చర్యపరిచాడు. నటుడిగా.. రచయితగా ఈ రెండు సినిమాలూ అతడికి ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు సినిమాల్ని వేర్వేరు దర్శకులు రూపొందించినా.. రెంటిలోనూ శేష్ మార్కు కనిపించింది. ఆయా దర్శకులు.. యూనిట్లలోని మిగతా సభ్యులు స్వయంగా శేష్ ఎంతగా ఈ సినిమాల్లో ఇన్వాల్వ్ అయింది వివరించారు. ఈ సినిమాల సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ శేష్‌కే దక్కుతున్న మాట వాస్తవం. అది అన్యాయంగా కూడా ఎవరికీ అనిపించట్లేదు. అతను ఈ ప్రశంసలకు అర్హుడనే అంటున్నాడు. ‘క్షణం’తో పాటు ‘గూఢచారి’కి కథ అందించడమే కాక.. స్క్రీన్ ప్లేలో కూడా భాగస్వామి అయ్యాడు. మేకింగ్ విషయంలోనూ అతడి పాత్ర చాలా కీలకం అంటున్నారు.

ఐతే ఈ రెండు సినిమాలు ఇంత పకడ్బందీగా తెరకెక్కడంలో కీలకంగా వ్యవహరించిన శేష్.. తాను ఇంతకుముందు డైరెక్ట్ చేసిన సినిమాల విషయంలో అంత ఘోరంగా ఎందుకు ఫెయిలయ్యాడన్నదే అర్థం కాని విషయం. శేష్ ఇంతకుముందు దర్శకుడిగా ‘కర్మ’.. ‘కిస్’ అనే రెండు సినిమాలు తీశాడు. ఐతే ఆ చిత్రాలు వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. అతడికి అప్పటికి పాపులారిటీ లేదు కాబట్టి జనాలకు చేరలేదనుకోవడానికేమీ లేదు. ‘కర్మ’లో వైవిధ్యంగా అనిపిస్తుంది కానీ.. అది జనాలకు అర్థం కాదు. ‘కిస్’లో అసలే ప్రత్యేకతా కనిపించదు. ఐతే ఆ సినిమాలు తీసేటప్పటికీ శేష్‌కు సినిమాల్లో పెద్దగా అనుభవం లేదు. వాటి తర్వాత అతను నటుడిగా చాలా సినిమాలు చేశాడు. మేకింగ్ గురించి చాలా తెలుసుకున్నాడు. రచయితగా అతడి దగ్గర మంచి ఆలోచనలున్నా.. వాటిని స్ట్రీమ్ లైన్ చేసే వాళ్లు కూడా అవసరమయ్యారు. ఆ విషయంలో అబ్బూరి రవి తోడ్పాటు అతడికి కలిసొచ్చింది. ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలున్న శేష్‌ను కంట్రోల్ చేసి.. అతడి ఆలోచనల్ని పకడ్బందీగా తెరమీదికి తీసుకొచ్చేదర్శకుల సాయం కూడా అవసరమైంది. ఆ పనిని ‘క్షణం’కు రవికాంత్ పేరెపు.. ‘గూఢచారి’కి శశికిరణ్ తిక్క చేసి పెట్టారు. వీళ్లతో అతడి భాగస్వామ్యం కలిసొచ్చింది. సినిమాలు జనరంజకంగా తయారయ్యాయి. మంచి విజయం సాధించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు