కియారా స్టెప్పులతో ప్రభుదేవా పాట

కియారా స్టెప్పులతో ప్రభుదేవా పాట

డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్న ప్రభుదేవాకు హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చిన సినిమా ‘ప్రేమికుడు’. శంకర్ రూపొందించిన ఈ చిత్రం 90ల్లో యువతను ఒక ఊపు ఊపేసింది. ఐతే కథా కథనాల పరంగా శంకర్ సినిమాలన్నింట్లో కొంచెం వీక్‌గా కనిపించే ఈ చిత్రానికి పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే. ముఖ్యంగా ఊర్వశీ ఊర్వశీ పాట అప్పట్లో పెద్ద సంచలనమే. రెహమాన్ ట్యూన్.. ప్రభుదేవా స్టెప్పులు.. శంకర్ మేకింగ్.. ఈ పాటను ఆల్ టైం చార్ట్ బస్టర్‌గా నిలిపాయి. ఇప్పటికి కూడా అక్కడక్కడా ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఐతే దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ పాటకు బాలీవుడ్ సెలబ్రెటీలు ట్రిబ్యూట్ ఇవ్వబోతుండటం విశేషం.

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబయి భామ కియారా అద్వానీ.. స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ఊర్వశీ ఊర్వశీ పాట మీద ఒక స్పెషల్ మ్యూజిక్ వీడియో చేయబోతుండటం విశేషం. ఈ పాటను ఇప్పుడు బాలీవుడ్ కాస్ట్లీ సింగర్ యోయో హనీ సింగ్ ఆలపించనున్నాడు. అతనే మ్యూజిక్ కూడా చేస్తున్నాడు. మామూలుగానే హనీ సింగ్ చేసే మ్యూజిక్ వీడియోలకు రెస్పాన్స్ ఓ రేంజిలో ఉంటుంది. కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. అలాంటిది ఊర్వశీ పాటకు ట్రిబ్యూట్ చేస్తుండటం.. దానికి తిరుగులేని డ్యాన్సర్ అయిన షాహిద్ స్టెప్స్ వేస్తుండటం.. కియారా లాంటి క్రేజీ బ్యూటీ తోడవుతుండటంతో ఈ పాట ఏ రేంజిలో ఉంటుందో అని ముందే అంచనాలు మొదలైపోయాయి. మరి ఈ పాట ఎలా ఉంటుందో.. ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ పాటను లాంచ్ చేయబోతున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు