అనుష్కతో ఇప్పుడు లవ్ స్టోరీనా?

అనుష్కతో ఇప్పుడు లవ్ స్టోరీనా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా యాక్షన్ ప్రధానమైన భారీ సినిమాలే చేస్తూ వచ్చింది. హీరోలకు జోడీగా నటించినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అంతే. ఆమె ఆహార్యానికి సెన్సిబుల్ లవ్ స్టోరీలు అస్సలు సెట్టవ్వవన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.

చిన్న వయసులో.. నాజూగ్గా ఉన్నపుడే అనుష్క లవ్ స్టోరీలు ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు వయసు మీద పడింది. పైగా ఆమె షేప్ అవుట్ అయిపోయింది. ‘సైజ్ జీరో’తర్వాత ఆమె ఎంత కష్టపడ్డా మునుపటి రూపంలోకి మారలేకపోతోంది. 35వ పడికి చేరువగా ఉన్న అనుష్కలో ఒక రకమైన ముదురుతనం వచ్చేసిన మాట వాస్తవం. మరి ఈ వయసులో.. ఇప్పుడున్న లుక్‌తో ఆమె లవ్ స్టోరీలో నటిస్తే జనాలకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది..? కానీ ఆమె మాత్రం నిజంగానే ఓ ప్రేమకథలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావె’ తమిళ వెర్షన్ ‘విన్నైతాండి వరువాయ’కు సీక్వెల్ తీయబోతున్నాడట. తొలి భాగంలో శింబు-త్రిష జంటగా నటించారు. సీక్వెల్లోనూ శింబునే హీరో కాగా.. కథానాయికగా అనుష్క నటిస్తుందని అంటున్నారు. గౌతమ్‌తో అనుష్క సినిమా చేస్తుందని కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి. కానీ అది ఏ సినిమా అన్నది మాత్రం వెల్లడి కాలేదు.

ఎంతకీ ఈ చిత్రం సంగతేమో తేలకపోవడంతో అనుష్క వేరే సినిమా వైపు వెళ్లిపోనుందని ఇటీవల వార్తలొచ్చాయి కానీ.. తాజాగా తమిళ మీడియా మాత్రం శింబు-అనుష్కల కాంబినేషన్లో గౌతమ్ ‘విన్నితాండి వరువాయ-2’ తీయబోతున్నట్లుగా వార్తలు ఇస్తోంది. అనుష్కకు మామూలుగానే లవ్ స్టోరీ సెట్టవదంటే.. ఈ వయసులో ‘విన్నైతాండి వరువాయ’ లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీ సీక్వెల్లో నటిస్తుందంటే ఊహించుకోవడానికే ఏదోలా అనిపిస్తోంది. మరి గౌతమ్ ఆలోచనేంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English