చిరుత పిల్ల.. హీట్ మరింత పెంచింది

చిరుత పిల్ల.. హీట్ మరింత పెంచింది

ఈ రోజుల్లో గ్లామర్ గాళ్స్ పాపులారిటీ తెచ్చుకోవడానికి కేవలం సినిమాలే అవసరం లేదు. హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినా చాలు.. కావాల్సినంత పాపులారిటీ వస్తుంది. సినిమా అవకాశాలు తగ్గిన కొందరు హీరోయిన్లు ఇలాంటి షూట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఈషా గుప్తా ఇలాగే సూపర్ పాపులర్ అయింది. ఈ కోవలో నడుస్తున్న మరో బాలీవుడ్ భామ నేహా శర్మ. తెలుుగలో రామ్ చరణ్ సరసన ‘చిరుత’ సినిమా చేసి మాయమైన ఈ భామ.. సామాజిక మాధ్యమాల్లో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. రోజు రోజుకూ హాట్నెస్ పెంచేస్తూ ఆమె రిలీజ్ చేస్తున్న ఫొటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా రెడ్ బికినీలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి కొనసాగింపుగా మరోసారి బికినీ అవతారంలో నేహా స్టన్నింగ్ పోజులిచ్చింది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున గ్రీన్ బికినీలో క్లీవేజ్ షో చేస్తూ సెగలు రేపుతోంది నేహా. మాగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఆమె ఇలా పోజు ఇచ్చింది. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈ పోజు.. సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయింది. దీంతో పాటుగా నేహా మాగ్జిమ్ కోసం ఇచ్చిన హాట్ హాట్ పోజులతో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులోనూ ఆమె రచ్చ మామూలుగా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English