విజయ్ దేవరకొండ.. అసిస్టెంట్ ప్రొఫెసర్

విజయ్ దేవరకొండ.. అసిస్టెంట్ ప్రొఫెసర్

‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఏడాది కావస్తోంది. ఇంత కాలానికి విజయ్ దేవరకొండ నుంచి కొత్త సినిమా రాస్తోంది. మధ్యలో ‘ఏం మంత్రం వేసావె’ అంటూ విజయ్ నటించిన ఒక పాత సినిమా వచ్చింది కానీ.. దాన్ని జనాలు పట్టించుకోలేదు. ఈ నెల 15న రాబోయే ‘గీత గోవిందం’ మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. ఇందులో విజయ్ ఎలాంటి పాత్ర చేశాడు.. ఎలా పెర్ఫామ్ చేశాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అతడి అభిమానులు. ఐతే ‘అర్జున్ రెడ్డి’తో పోలిస్తే ఇందులోని విజయ్ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు పరశురామ్. ఈ చిత్రంలో విజయ్ పాత్ర గురించి అతను ఆసక్తికర విషయాలు చెప్పాడు.


‘గీత గోవిందం’లో విజయ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నాడట. నిజానికి ఇందులో హీరో గోల్ టీచింగ్ కాదట. అతను జూనియర్ సైంటిస్ట్ పాత్ర కోసం అప్లై చేసి ఉంటాడట. ఆలోపు ఒక జూనియర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తుంటాడట. హీరోయిన్ రష్మిక మందానా ఐటీ ఎంప్లాయ్ పాత్ర చేసిందట. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో పాత్రను బట్టి విజయ్ అలా అగ్రెసివ్‌గా నటించాడని... తన సినిమాలోని పాత్రకు అనుగుణంగా కొత్తగా నటించాడని.. ఇందులో అతడి పాత్ర డౌన్ టు ఎర్త్.. ఫ్యామిలీ ఓరియంటెడ్ అని.. వాల్యూస్ ఉన్న ఓ మంచి వ్యక్తిగా అతను కనిపిస్తాడని పరశురామ్ చెప్పడం విశేషం. ఇక ఈ చిత్రంలో విలన్లు ఎవరు లేరని.. గీతకు గోవిందే విలన్.. గోవిందానికి గీతే విలన్ అని.. వాళ్ల ఐడియాలజీ క్లాష్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని పరశురామ్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు