ఆ నిర్మాత.. చిరుతో.. బన్నీతో.. వరుణ్‌తో

ఆ నిర్మాత.. చిరుతో.. బన్నీతో.. వరుణ్‌తో

తెలుగులో సుదీర్ఘ చరిత్ర ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. చరిత్రలో దానికి దీటైన.. ఇంకా పెద్ద బేనర్లు తెలుగులో చాలా ఉన్నాయి కానీ.. ఇప్పటికీ ప్రత్యేకతను చాటుకుంటూ యాక్టివ్‌గా ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ముందుంటుంది. దీని అధినేత అల్లు అరవింద్ అభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడప్పుడూ తన స్థాయికి తగ్గ భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. కొంచెం మీడియం రేంజిలో ఈ ట్రెండుకు తగ్గ యూత్ ఫుల్ సినిమాలూ తీస్తూ సాగిపోతున్నారాయన. ఆయన బేనర్ నుంచి ‘గీత గోవిందం’.. ‘ట్యాక్సీవాలా’ లాంటి మీడియం రేంజి సినిమాలు రాబోతున్నాయి. దీని తర్వాత అరవింద్ మూడు ఆసక్తికర సినిమాలకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో రెండు భారీ చిత్రాలే. తాజాగా వ్యక్తిగత పని మీద తాడేపల్లిగూడెంకు వెళ్లిన అరవింద్.. తాను తీయబోయే తర్వాతి మూడు సినిమాల్లో హీరోలెవరో వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లతో తాను సినిమాలు చేయబోతున్నట్లు అరవింద్ తెలిపాడు. చిరంజీవితో అరవింద్ సినిమా తీస్తాడన్న సమాచారం ఇంతకుముందే బయటికి వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆ సినిమాను అనుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు చేసేది ఆ చిత్రమే అన్నారు. కానీ అనుకోకుండా కొరటాల శివ లైన్లోకి వచ్చాడు. ఆ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మాణంలోనే చేయబోతున్న చిరు.. దాని తర్వాత అరవింద్‌కు సినిమా చేసే అవకాశముంది. ఇక ‘నా పేరు సూర్య’తో దెబ్బ తిన్న బన్నీ.. ఈసారి జాగ్రత్తగా తన సొంత బేనర్లోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని అరవింద్ దగ్గరుండి పర్యవేక్షించనున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందన్నారు కానీ.. అది ఇంకా ఖరారవ్వలేదు. విక్రమ్‌తో అయినా.. ఇంకెవరితో అయినా.. బన్నీ సినిమా మాత్రం ‘గీతా ఆర్ట్స్’లోనే ఉంటుంది. ఇక వరుణ్ తేజ్‌తో అరవింద్ ఎప్పుడు సినిమా తీస్తారో.. దానికి దర్శకుడెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English