గ్రేట్ డైరెక్టర్.. అంత ఇంప్రెస్ అయిపోయడా?

గ్రేట్ డైరెక్టర్.. అంత ఇంప్రెస్ అయిపోయడా?

 గంగిగోవు పాలు గరిటడైనా చాలు.. కడవనైన ఏమి కరము పాలు అని ఒక సామెత. రాజ్ కుమార్ హిరాని సినిమాలు చూస్తే ఇదే సామెత గుర్తుకొస్తుంది. దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలై దశాబ్దంన్నర అయింది. ఇన్నేళ్లలో హిరాని తీసింది ఐదే ఐదు సినిమాలు. కానీ ఆ ఐదూ కూడా బ్లాక్ బస్టర్లే. ఒకదాన్ని మించి ఇంకోటి విజయం సాధించాయి. తాజాగా రణబీర్ కపూర్ లాంటి మీడియం రేంజి హీరోను పెట్టి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు హిరాని. ఆయనతో పని చేయడానికి బాలీవుడ్ టాప్ స్టార్లు తహతహలాడుతారు. అమీర్ ఖాన్ లాంటి హీరో హిరానితో రెండు సినిమాలు చేశాడు. మిగతా సూపర్ స్టార్లు కూడా హిరానితో పని చేయడానికి ఎంతో ఇష్టపడతారు. ఐతే హిరాని మాత్రం ఒక నటుడికి ఫిదా అయిపోయాడు. అతనే రణబీర్ కపూర్.

ఇంతకుముందు హిరాని తీసిన ‘పీకే’లో రణబీర్ చిన్న క్యామియో చేశాడు. దానికి ఇంప్రెస్ అయి ‘సంజు’ సినిమాలో అతడినే హీరోగా పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్‌ పాత్రను రణబీర్ ఎంత గొప్పగా పోషించాడో తెలిసిందే. ముందు ఈ పాత్రకు రణబీర్‌ను వద్దన్న నిర్మాత విధు వినోద్ చోప్రా సైతం ఆ తర్వాత ఫిదా అయిపోయాడు. తన హీరో విషయంలో హిరాని కూడా చాలానే ఇంప్రెస్ అయిపోయాడట. అది ఎంతగా అంటే.. ఇకపై తాను తీసే ప్రతి సినిమాలోనూ రణబీర్‌కు ఒక పాత్ర ఇవ్వాలని డిసైడయ్యాడట. ‘సంజు’ తర్వాత ‘మున్నాభాయ్-3’ తీయాలనుకుంటున్న హిరాని.. ఇంతకుముందు అర్షద్ వార్సి పోషించిన సర్క్యూట్ పాత్రకు రణబీర్‌నే ఎంచుకున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రమే కాదు.. ఆ తర్వాత తీసే సినిమాల్లోనూ రణబీర్‌కు ఒక చిన్న పాత్రయినా ఉండేలా చూస్తానని సన్నిహితుల వద్ద హిరాని వ్యాఖ్యానించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఒకవేళ పాత్ర ఇవ్వలేని పరిస్థితుల్లో రణబీర్ ఫొటో అయినా తన సినిమాలో ఉంటుందని హిరాని చెప్పినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు