కౌశల్‌ ఆర్మీకి అడ్డంగా దొరికేసారు

కౌశల్‌ ఆర్మీకి అడ్డంగా దొరికేసారు

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ని శాసిస్తోన్న కౌశల్‌ ఆర్మీకి ఎంతో కాలంగా టార్గెట్‌గా వున్న తనీష్‌, బాబు గోగినేని ఇద్దరూ ఈసారి నామినేషన్లలో దొరికేసారు. ఈసారి నామినేషన్‌కి ఫిజికల్‌ టాస్క్‌ పెట్టిన బిగ్‌బాస్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా పేలవంగా ఓడిపోయి ముందుగా నామినేట్‌ అయ్యాడు గోగినేని బాబు. స్పోర్టింగ్‌ స్పిరిట్‌ చూపించకపోగా, ఆడవాళ్లని తోసివేసి గెలవలేనని, అందుకే తాను ఓడిపోయినా గెలిచినట్టేనని చచ్చు వివరణ ఒకటి తనదైన శైలిలో ఇచ్చుకున్నాడు.

ఇక తనీష్‌ అయితే మరోసారి దీప్తి సునయనని నామినేషన్స్‌ నుంచి కాపాడి విమర్శల పాలవుతున్నాడు. టాస్క్‌లో రియల్‌గా పాల్గొనాల్సింది పోయి, తనకి కావాల్సిన వ్యక్తులని కాపాడుకుని మరోసారి గ్రూపిజం చూపించాడు. ఇంకా ఈ టాస్క్‌లో గీతామాధురి, శ్యామల, గణేష్‌, దీప్తి నల్లమోతు కూడా నామినేట్‌ అయ్యారు. కౌశల్‌ నామినేషన్స్‌లో లేకపోవడంతో కౌశల్‌ ఆర్మీ ఎలాగైనా తనీష్‌ లేదా బాబుల్లో ఒకరినైనా బయటకి పంపించేయాలని ఓటింగ్‌పై దృష్టి పెట్టింది. మిగిలిన నలుగురి మధ్య ఓట్లు పంచుతూ వీరిని టార్గెట్‌ చేసింది.

అయితే కౌశల్‌కి వ్యతిరేక వర్గం ఈ ఇద్దరినీ కాపాడుకోవాలని చూస్తోంది. కాకపోతే ఈ గ్రూపులో ఒక్కరు మాత్రమే వుంటేనే కాపాడుకోవడానికి ఆస్కారముంటుంది. మరి ఈ వారంలో కౌశల్‌ ఆర్మీ టార్గెట్‌ చేసిన ఈ ఇద్దరిలో ఒకరు బయటకి వెళతారా లేక ఇంతకాలం అదృష్టం కొద్దీ హౌస్‌లో వుంటోన్న గణేష్‌ ఎగ్జిట్‌ అవుతాడా అనేది చూడాలి. కౌశల్‌ నామినేషన్‌లో లేని ప్రతిసారీ ఓటింగ్‌లో ఒక పెద్ద తలకాయ వెళ్లిపోతోంది కనుక తనీష్‌ లేదా బాబుకే మూడిందనిపిస్తోంది. ఎర్లీ ఓటింగ్‌ ట్రెండ్స్‌ కూడా ఇందుకు తగ్గట్టే వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు