నాలుగు రోజుల్లో లాభాల్లోకి

నాలుగు రోజుల్లో లాభాల్లోకి

విడుదలకి ముందు ఎంత ఆసక్తి రేకెత్తించిన సినిమా అయినా కానీ మరో రెండు చిత్రాలతో పోటీ వున్నపుడు వసూళ్లు రావడం అంత తేలిక కాదు. అందులోను పోటీగా వున్న సినిమాల్లో ఒక దానికి నాగార్జున అండ, మరోదానికి మారుతి బ్రాండ్‌ కూడా తోడయ్యాయి. అయినా కానీ 'చి.ల.సౌ', 'బ్రాండ్‌ బాబు' చిత్రాల పోటీని తట్టుకుని 'గూఢచారి' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మాస్‌ మెచ్చే తరహా చిత్రం కాకపోయినా కానీ టార్గెట్‌ ప్రేక్షకుల అండదండలతో వసూళ్లు రాబడుతోంది.

ఈ చిత్రానికి నాలుగు రోజుల్లోనే అయిదు కోట్లకి పైగా షేర్‌ వసూలయింది. దీనిపై బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి, థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగా వేసిన వేల్యూయేషన్‌కి మించిన వసూళ్లే నాలుగు రోజుల్లో వచ్చాయి. ఆదివారం తర్వాత డౌన్‌ అవుతుందేమో అనుకుంటే సోమవారం కూడా మంచి వసూళ్లు తెచ్చుకుని స్ట్రాంగ్‌గా నిలబడింది. శ్రీనివాస కళ్యాణం వల్ల తీవ్రంగా వసూళ్లు పడిపోకపోతే మాత్రం పది కోట్ల వరకు ఈ చిత్రం వసూలు చేస్తుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఈ చిత్రం వల్ల 'చి.ల.సౌ' చిత్రానికి వసూళ్లు లేకుండా పోయాయి. కనీసం సిటీస్‌లో కూడా ఆ చిత్రం ప్రభావం చూపించలేకపోతోంది. బ్రాండ్‌ బాబు అయితే టోటల్‌ వాష్‌ అవుట్‌ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు