కొత్త జంట‌ల‌కు దిల్ రాజు బంప‌ర్ ఆఫ‌ర్...

కొత్త జంట‌ల‌కు దిల్ రాజు బంప‌ర్ ఆఫ‌ర్...

ల‌వ‌ర్ బాయ్ నితిన్, రాశి ఖ‌న్నా జంట‌గా...స‌తీశ్ వేగేశ్న తెర‌కెక్కించిన `శ్రీ‌నివాస క‌ల్యాణం` చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణం...క‌మ‌నీయం....జీవితం...అనే కాన్సెప్ట్ తో వివాహ వేడుక‌, సంప్ర‌దాయాలు, బంధుత్వాల ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేసేలా  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ..నిర్మాణ సార‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ ను బ‌ట్టి ఇది క్లీన్ యూ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ అని అర్థ‌మైంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఈ శ్రావ‌ణ మాసంలో వివాహం జ‌రుపుకుంటోన్న జంట‌ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు బ‌హూక‌రించ‌బోతున్నామ‌ని శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్(ఎస్వీసీ) త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

అందుకుగానూ ఈ శ్రావ‌ణ మాసంలో పెళ్లి చేసుకోబోతున్న జంట‌లు త‌మ వెడ్డింగ్ కార్డ్ ను ఎస్వీసీకి చేరేలా పంపాల‌ని ట్వీట్ చేసింది. ఈ శ్రావణ మాసంలో కళ్యాణం జరుపుకుంటున్న జంటలకు  ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర బృందం ఆహ్వానం ప‌లికింది. ఆ జంట‌ల శుభలేఖలు త‌మ‌కు పంపిస్తే జంటలందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. అంతేకాదు, ఆ జంట‌ల‌లో ఎంపిక చేసిన కొన్ని జంట‌ల‌ను చిత్ర యూనిట్ స్వ‌యంగా క‌లిసి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌బోతున్నామ‌ని తెలిపింది. అంద‌రినీ క‌లిసే అవ‌కాశం ఉండ‌దు కాబ‌ట్టి...మిగిలిన వారికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను ఇంటికి పంపిస్తామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం  ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇప్ప‌టికే కొన్ని జంట‌లు త‌మ శుభ‌లేఖ‌ల‌ను ఈ ట్వీట్ కు జ‌త‌చేస్తూ రీట్వీట్ చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు