సినిమా చూసి దర్శకుడి పాదాల్ని తాకా

సినిమా చూసి దర్శకుడి పాదాల్ని తాకా

గత వారాంతంలో వచ్చిన మూడు సినిమాల్లో రెండు మంచి ఫలితాన్నందుకున్నాయి.  ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి టాక్, కలెక్షన్లతో సాగిపోతున్నాయి. ఇక ఫోకస్ అంతా తర్వాతి వారాంతంలో రాబోయే ‘శ్రీనివాస కళ్యాణం’ మీదికి మళ్లింది. ఈ చిత్రం పాజిటివ్ బజ్‌తో విడుదలవుతోంది. ఈ సినిమా గురించి చిత్ర బృందంలోని వ్యక్తులు ఓ రేంజిలో చెబుతుండటం విశేషం. ‘శ్రీనివాస కళ్యాణం’ కథానాయిక రాశి ఖన్నా అయితే.. ఈ సినిమా చూశాక ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయానని.. దర్శకుడు సతీశ్ వేగేశ్న పాదాల్ని తాకానని అంటోంది.

ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. ‘‘మా టీంతో కలిసి సినిమా చూశాను. మనసుకు హత్తుకునేలా ఉందీ చిత్రం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో అందరి హృదయాల్ని కదిలిస్తుంది. సినిమా చూసిన వెంటనే నేను సతీశ్ వేగేశ్న గారి దగ్గరికెళ్లి పాదాల్ని తాకాను. ఇప్పటికీ ఈ సినిమా నుంచి బయటికి రాలేదు. 9న థియేటర్లలో చూసిన ప్రేక్షకులు కూడా నాలాగే ఫీలవుతారనుకుంటున్నా’’ అని రాశి చెప్పింది.

‘శ్రీనివాస కళ్యాణం’ చూశాక వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుందని రాశి తెలిపింది. ఈ సినిమాలో తాను సిరి పాత్రలో నటించానని.. పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇదని.. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లోకెల్లా ఇది బెస్ట్ అని ప్రేక్షకులు అంటారని రాశి ధీమా వ్యక్తం చేసింది. ‘తొలి ప్రేమ’ తర్వాత తాను తెలుగులో ఓకే చేసిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ ఒక్కటేనని.. ఇంకో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని.. తమిళంలో తాను ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నానని రాశి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు