ఏఎన్నార్‌ను ఎలా మ్యాచ్ చేస్తాడు?

ఏఎన్నార్‌ను ఎలా మ్యాచ్ చేస్తాడు?

వ్యక్తుల నిజ జీవిత కథలతో సినిమాలు తీయడం పెద్ద సవాలే. ఈ విషయంలో ముందు ఎదురయ్యే సమస్య ఆయా పాత్రలకు సరైన నటీనటుల్ని ఎంచుకోవడం. వివిధ పాత్రలకు తగ్గట్లు పోలికలు సరిగ్గా ఉన్న నటుల్ని ఎంచుకోవాలి. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ సహా ప్రతిదీ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇది అంత సులువైన విషయం కాదు.

ఐతే ‘మహానటి’ చిత్ర బృందం.. ఈ విషయంలో మంచి మార్కులు అందుకుంది. అందులో దాదాపుగా అన్ని పాత్రలకూ నటీనటులు చక్కగా సెట్ అయ్యారు. మరి దీని తర్వాత రాబోతున్న మెగా బయోపిక్ ‘యన్.టి.ఆర్’లో ఏ పాత్రకు ఎవరిని.. ఎలా చూపిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో వివిధ పాత్రలకు ఫలానా నటీనటులంటూ ఇప్పటికే కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.

తాజాగా ఇందులో ఏఎన్నార్ పాత్రకు సుమంత్‌ ఎంపికైనట్లు అధికారికంగానే వెల్లడైంది. ఇది కొన్ని రోజుల కిందట్నుంచి ప్రచారంలో ఉన్న వార్తే. ఐతే ఈ న్యూస్ బయటికి వచ్చినప్పట్నుంచి ఏఎన్నార్ పాత్రకు సుమంత్ ఏమాత్రం సెట్టవుతాడన్న సందేహాలున్నాయి. ముందు ఇక్కడ డౌట్ కొట్టేది ఎత్తు దగ్గరే. ఏఎన్నార్ చాలా పొట్టిగా ఉంటాడు. సుమంత్ చూస్తే ఆరడుగుల ఆజానుబాహుడు. అసలు ఈ విషయంలో ఇద్దరికీ ఏమాత్రం మ్యాచ్ కాదు. ఇక ఓవరాల్ బాడీ పోస్చర్ చూసినా.. ఏఎన్నార్‌కు, సుమంత్‌కు పోలికే ఉండదు. ముఖంలోనూ పోలికలు తక్కువే. ఎంత మేకప్‌తో మేనేజ్ చేసినా కూడా సుమంత్‌ను ఏఎన్నార్‌లా తయారు చేయడం కష్టమే అనిపిస్తోంది.

సుమంత్ బాడీనే ఓ తీరుగా ఉంటుంది. అతనొక బాడీ బిల్డర్‌ లాగా కనిపిస్తాడు. ఏఎన్నార్ దానికి క్వయిట్ ఆపోజిట్. వాయిస్ విషయంలో ఏమైనా సుమంత్ కొంచెం మ్యాచ్ చేయొచ్చేమో. అతడితో పోలిస్తే ‘మహానటి’లో ఏఎన్నార్‌గా కనిపించిన నాగచైతన్య నయం. అతను కూడా ఏఎన్నార్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేయలేకపోయినా.. ఓకే అనిపించాడు. కానీ సుమంత్ మాత్రం ఏఎన్నార్‌గా ఏమాత్రం ఫిట్టవుతాడన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English