మహేష్ 25 టైటిల్ అదేనా?

మహేష్ 25 టైటిల్ అదేనా?

ఇంకో మూడు రోజులే మిగిలుంది.. మహేష్ పుట్టిన రోజుకు. ప్రతి పుట్టిన రోజుకూ తన అభిమానులకు ఏదో ఒక కానుక ఇచ్చే మహేష్.. ఈసారి కూడా ఒక ప్రత్యేకమైన బహుమతితో సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కెరీర్లో మైలురాయి అనదగ్గ 25వ చిత్రం టైటిల్.. ఫస్ట్ లుక్ అతడి పుట్టిన రోజుకే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఎంబ్లమ్ రిలీజ్ చేశారు.

ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించి రోజుకే హింట్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పటికే ‘ఐ’.. ‘ఆర్’ అనే లెటర్స్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఎస్’ అనే అక్షరంతో మరో హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఈ మూడు అక్షరాల్ని కలిపి.. మహేష్ 25వ సినిమా టైటిలేంటో గెస్ చేసే ప్రయత్నంలో పడ్డారు అభిమానులు.

సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ప్రచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ‘రిషి’ అనే టైటిల్ ఖరారు చేసి ఉండొచ్చంటున్నారు. అదే మహేష్ పాత్ర పేరు అయ్యుంటుందని.. దాన్నే టైటిల్‌గా ఖాయం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో వేచి చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్లో ఉంది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు.

దిల్ రాజు.. అశ్వినీదత్.. పీవీపీ లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మహేష్ గడ్డం పెంచి సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English