మళ్లీ ‘సింగం’ కాంబినేషన్?

మళ్లీ ‘సింగం’ కాంబినేషన్?

సూర్య-అనుష్క కాంబినేషన్‌కు దక్షిణాదిన సూపర్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి ఇప్పటికే. అవి మూడూ ఒకే సిరీస్‌లోవి కావడం విశేషం. ముందుగా వీళ్లిద్దరూ కలిసి ‘సింగం’ సినిమా చేశారు. అది సూపర్ హిట్టవడంతో ఆ తర్వాత ‘సింగం-2’.. ‘సింగం-3’ కూడా వచ్చాయి. వీటిలో చివరగా వచ్చిన ‘సింగం-3’ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఐతే మళ్లీ వీరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఆ చిత్రానికి కూడా ‘సింగం’ దర్శకుడు హరినే దర్శకత్వం వహిస్తాడట. కానీ అది ‘సింగం’ సిరీస్‌లోని సినిమా కాదట. నిజానికి ‘సింగం-4’ తీయడానికి హరి ఇంతకుముందే సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అదే కథను కొంచెం మార్చి ‘సామి స్క్వేర్’ తీశాడు. అది త్వరలోనే విడుదల కాబోతోంది.

దీని తర్వాత హరి తీయబోయే సినిమాకు సూర్య, అనుష్కలే హీరో హీరోయిన్లట. ఈసారి పోలీస్ స్టోరీ కాకుండా వేరే సబ్జెక్టుతో సినిమా చేయనున్నాడట హరి. ప్రస్తుతం సూర్య.. రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ‘ఎన్జీకే’ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీంతో పాటే ‘రంగం’ దర్శకుడు కె.వి.ఆనంద్ సినిమాలోనూ నటిస్తున్నాడు సూర్య.

ఈ చిత్రాన్ని ‘2.0’ నిర్మాతలు భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక వచ్చే ఏడాదిలో హరి సినిమాను మొదలుపెడతాడట సూర్య. ‘భాగమతి’ తర్వాత అనుష్క చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గి ఒకప్పటి రూపంలోకి మారాలని అనుష్క డిసైడైనట్లు సమాచారం. ఈ ఏడాదంతా అనుష్క దాదాపుగా ఖాళీగానే ఉండబోతోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English