సాయి పల్లవిపై మెగా కుట్ర?

సాయి పల్లవిపై మెగా కుట్ర?

సాయి పల్లవికి ఎంత క్రేజ్‌ వుందో ఆమె గురించిన రూమర్స్‌ కూడా అంతే బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఆటిట్యూడ్‌ గురించి ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. హీరోలని గౌరవించదని, సెట్స్‌కి సమయానికి రాదని, నిర్మాతలంటే లెక్క లేదని ఆమెపై చాలానే పుకార్లు వినిపిస్తున్నాయి.

మొదట్లో ఇలాంటి వాటిని లైట్‌ తీసుకున్న సాయి పల్లవి ఇలాంటి ప్రచారం వల్ల జరుగుతోన్న డ్యామేజ్‌ గుర్తించింది. అందుకే ఇవన్నీ అసత్య ప్రచారాలని, తనకి ఎవరితోను ఎలాంటి సమస్య లేదని, ఇదంతా కావాలని చేస్తోన్న ప్రచారమే తప్ప నిజం లేదని ఆమె చెప్పింది. అంతే కాకుండా తనంటే గిట్టని వారు చేస్తోన్న తప్పుడు ప్రచారమని కూడా ఆమె చెబుతోంది.

సాయి పల్లవిపై పనిగట్టుకుని ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి వుంది. ఒక అగ్ర నిర్మాతతో సాయి పల్లవి విబేధించిందని, అతని సినిమాలో నటించడానికి నిరాకరించిందని, దాంతో అతని తరఫు వాళ్లే సాయి పల్లవి గురించి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిదా తర్వాత చాలా హాట్‌గా కనిపించిన సాయి పల్లవికి మునుపటి కంటే అవకాశాలైతే తగ్గాయి. ఆమెకి బదులుగా రాశి ఖన్నాలాంటి వాళ్లని ఎంకరేజ్‌ చేస్తూ సాయి పల్లవి అవకాశాలకి గండి కొడుతున్నారని కూడా గాసిప్స్‌ వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు