అఖిల్‌ రేంజ్‌ బాగా పడిపోయింది

అఖిల్‌ రేంజ్‌ బాగా పడిపోయింది

నిన్న మొన్నటి వరకు అక్కినేని అఖిల్‌ సినిమాకి దర్శకుడంటే టాప్‌లో వున్న వారి పేర్లు మాత్రం పరిశీలనలోకి వచ్చేవి. త్రివిక్రమ్‌, కొరటాల శివ, సుకుమార్‌ లాంటి దర్శకుల కోసం నాగార్జున బలంగా ప్రయత్నించినా కానీ వారికున్న కమిట్‌మెంట్ల వల్ల ఎవరూ దొరకలేదు. దాంతో ఖాళీగా కూర్చోవడం కంటే నచ్చిన కథని ఓకే చేసి బిజీగా వుండడం మేలని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్‌ తన మూడవ చిత్రం చేసేస్తున్నాడు. ఆ తర్వాత చేసే చిత్రం కూడా చిన్న బడ్జెట్‌ చిత్రమేనని తెలిసింది.

సుకుమార్‌ కథ రాసిన 'కుమారి 21 ఎఫ్‌' దర్శకుడు సూర్య ప్రతాప్‌తో అఖిల్‌ నాలుగవ చిత్రం చేస్తాడట. సుకుమార్‌తో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నించిన అఖిల్‌ ఇప్పుడు 'కుమారి' దర్శకుడితో అడ్జస్ట్‌ అయిపోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు. నాగచైతన్య స్టార్‌గా ఎదగకపోవడానికి కెరియర్‌ బిగినింగ్‌లో చేసిన మిస్టేక్స్‌ కారణమని ఫాన్స్‌ నమ్ముతారు. స్టార్‌ మెటీరియల్‌ అనుకున్న అఖిల్‌ని కూడా చైతన్యలా మిడిల్‌ రేంజ్‌ హీరోగా పరిమితం చేసేస్తూ వుండడం ఫాన్స్‌కి రుచించడం లేదు.

అయితే స్టార్‌ డైరెక్టర్లతో చేసిన సినిమాల వల్ల సక్సెస్‌ గ్యారెంటీ లేదని మొదటి రెండు చిత్రాలతో తేలిపోవడంతో మంచి కథలు ఓకే చేసి నటుడిగా అఖిల్‌కి సాలిడ్‌ ప్లాట్‌ఫామ్‌ సిద్ధం చేసాక తర్వాతి లెవల్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం ఉత్తమమని నాగార్జున డిసైడ్‌ అయినట్టున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు