సునీల్‌కి మొగుడైపోయాడు

సునీల్‌కి మొగుడైపోయాడు

హీరో వేషాలు కట్టి పెట్టి కమెడియన్‌ క్యారెక్టర్లు చేస్తోన్న సునీల్‌ పారితోషికం మాత్రం ఘనంగా డిమాండ్‌ చేస్తున్నాడని వినిపిస్తోంది. అరవింద సమేతలో ఒక కీలక పాత్ర కోసం సునీల్‌ బాగానే వసూలు చేసాడట. హీరో ఇమేజ్‌ తెచ్చుకున్నాడని త్రివిక్రమ్‌ అతనికి భారీగా పారితోషికం ఇప్పించాడట. అయితే అన్ని సినిమాలకీ ఇలా ఎక్కువ డిమాండ్‌ చేస్తే కుదరదు. గతంలో అంటే తన పాత్రలు చేయడానికి తను తప్ప మరో ఆప్షన్‌ వుండేది కాదు. కానీ ఇప్పుడు వెన్నెల కిషోర్‌ తెలుగు చిత్ర సీమకి ప్రధాన కమెడియన్‌గా అవతరించాడు.

నిన్న రిలీజ్‌ అయిన చి||ల||సౌ||, గూఢచారి చిత్రాల్లో వెన్నెల కిషోర్‌ హైలైట్‌గా నిలిచాడు. ఈమధ్య కాలంలో అతని కోసమే రచయితలు పాత్రలు సిద్ధం చేస్తున్నారు. అందరికీ అందుబాటులో వుండడం, ఎక్కువ డిమాండ్లు లేకపోవడంతో వెన్నెల కిషోర్‌తో ఇప్పుడు చిత్ర పరిశ్రమ హ్యాపీగా వుంది. ఓ రకంగా సునీల్‌ స్లాట్‌ని ఫిల్‌ చేసిన వెన్నెల కిషోర్‌ ఇంకా లైమ్‌ లైట్‌లో వుండగా సునీల్‌ వచ్చి తిరిగి తన ఆధిపత్యం చలాయించాలంటే కుదరదు.

ప్రస్తుతం కిషోర్‌ అతనికి మొగుడైపోయాడనే కామెంట్లు కూడా పడుతున్న నేపథ్యంలో సునీల్‌ తన ఉనికిని తిరిగి చాటుకుని మళ్లీ కమెడియన్‌గా హవా ఎలా కొనసాగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English