శ్రీదేవి వీడియోపై వివాదం

శ్రీదేవి వీడియోపై వివాదం

మొత్తానికి శ్రీదేవి మరణానికి సంబంధించిన వివాదం పూర్తిగా మరుగున పడిపోయింది. దాని గురించి ఇప్పుడు పట్టించుకునేవాళ్లే లేరు. ఐతే శ్రీదేవి మీద రూపొందించిన ఒక వీడియోకు సంబంధించిన వివాదం ఇప్పుడు తెరమీదికి వచ్చింది. శ్రీదేవికి సంబంధించిన మరపురాని ఫొటోలు, దృశ్యాలతో తాను రూపొందించిన వీడియోను ‘ఐఫా’ రూపకర్తలు వాడుకున్నారంటూ ఇటీవే సబా ఆరిఫ్ అనే అభిమాని ఆరోపించిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి చనిపోయిన నెల రోజుల తర్వాత ఆమెకు సంబంధించిన అపురూపమైన ఫొటోలను జోడిస్తూ చక్కటి వీడియోను రూపొందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఐఫా నిర్వాహకులు యధావిధిగా వాడేయడం వివాదాస్పదమైంది. దీనిపై సబా ఫేస్ బుక్‌లో పెద్ద పోస్టు పెడుతూ.. ఐఫా నిర్వాహకుల తీరును దుయ్యబట్టింది.

ఈ వివాదంపై తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ స్పందించాడు. సబా ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలి కానీ.. ఇలా ఆరోపణలు చేయడమేంటని అతను ప్రశ్నించాడు. సబా రూపొందించిన వీడియోలో చూపించిన ప్రతి ఫొటోపైనా హక్కులు తనవే అని.. ఆమె తమ ఫొటోల్ని వాడుకుని వీడియో రూపొందించి..  ఇప్పుడు తన వీడియోను వాడేశారని ఆరోపించడమేంటని బోనీ ప్రశ్నించాడు.

ఐఫా కోసం యశ్‌రాజ్‌ ఫిలింస్‌తో మాట్లాడి ఈ వీడియోను తనే ఓకే చేసినట్లు బోనీ వెల్లడించాడు. బోనీ స్పందనపై సబా మీడియాతో మాట్లాడింది. వీడియోలో చూపించిన ఫొటోలన్నీ ఆయన సొంతం అంటే తాను ఒప్పుకుంటానని.. కానీ ఈ వీడియో రూపొందించడానికి తాను ప్రాణం పెట్టానని.. మూడు రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఎంతో ప్రేమతో దీన్ని రూపొందించానని.. కానీ తన అనుమతి లేకుండా.. తనకు క్రెడిట్ ఇవ్వకుండా ఈ వీడియోను ఉన్నదున్నట్లుగా ఎలా వాడేస్తారని సబా ప్రశ్నించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English