పైరసీలో సినిమా చూడమన్న దర్శకుడు

పైరసీలో సినిమా చూడమన్న దర్శకుడు

ఏ దర్శకుడైనా తన సినిమాను పైరసీలో చూడమని ప్రేక్షకులకు పిలుపు ఇస్తాడా? కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా మాత్రం ఇలాంటి పిలుపే ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కానీ ఆయనీ మాట చెప్పడానికి కారణం లేకపోలేదు. అనుభవ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘ముల్క్’ను పాకిస్థాన్‌లో నిషేధించారు. ఇటీవలే సెన్సార్ కోసం వచ్చిన ఈ చిత్రాన్ని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు సభ్యులు చూసి.. పాకిస్థాన్‌ను ఇందులో చెడుగా చూపించారనే కారణంతో తమ దేశంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనుభవ్.. పాకిస్థాన్ ప్రేక్షకులు ఎలాగైనా ఈ సినిమా చూడాలని అన్నాడు. ఇందుకోసం ఆన్ లైన్‌ను ఆశ్రయించమని స్వయంగా కోరాడు. ఆన్ లైన్ ద్వారా పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేసుకుని అయినా సినిమా చూడాలని అతను స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

‘‘తాజాగా నేను ‘ముల్క్‌’ అనే సినిమాను తీశాను. అనుకోకుండా మీ దేశంలోని సెన్సార్‌ బోర్డు నా చిత్రాన్ని చూడకుండా నిషేధించింది. మీ అందరికీ నా విన్నపం.. ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు చూడకూడదనే సినిమాను నిషేధించారు. నాకు తెలుసు.. మీరు త్వరలో, భవిష్యత్తులో ఈ సినిమాను చూస్తారని. దయచేసి సినిమాను చూసి, పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు ఎందుకు సినిమాను నిషేధించిందో నాకు చెప్పండి. మీరంతా లీగల్‌గా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ కుదరని పక్షంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఇంట్లో కూర్చుని‌ అనధికారంగానైనా చూడండి. మరోపక్క మా బృందం పైరసీని ఆపడానికి కష్టపడుతోంది’’ అని అనుభవ్‌ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

ఐతే ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసుకుని సినిమాను చూడమంటున్నాడటంటే.. నెట్లో అందుబాటులో ఉన్న పైరసీ లింకుల్ని తొలగించే ప్రయత్నం ఏమీ ‘ముల్క్’ టీం చేయదనుకోవాలా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English