మళ్లీ సమంతతో సమంత ఢీ

మళ్లీ సమంతతో సమంత ఢీ

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే వారాంతంలో రిలీజ్ కావడం అరుదే కానీ.. హీరోయిన్లకు మాత్రం ఇలాంటి క్లాష్ అప్పుడప్పుడూ తప్పదు. కథానాయికలు ఒకేసారి వేర్వేరు సినిమాల్లో నటిస్తుంటారు. కాబట్టి ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే వారాంతంలో రిలీజయ్యే సందర్భాలు వస్తుంటాయి.

ఈ ఏడాది వేసవిలో సమంత నటించిన ‘మహనటి’.. ‘ఇరుంబు తిరై’ రెండు రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. రెండూ మంచి ఫలితాన్నందుకున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే సమంత ఈ ఫీట్‌ను రిపీట్ చేయబోతుండటం విశేషం. ఆమె నటించిన రెండు సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల కాబోతున్నాయి.

అందులో ముందు చెప్పుకోవాల్సింది సమంత తొలిసారిగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యు టర్న్’ గురించి. కన్నడ సినిమా ‘యు టర్న్’కు రీమేక్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 13న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. మాతృకను తెరకెక్కించిన పవన్ కుమారే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు.

మరోవైపు సమంత నటించిన తమిళ చిత్రం ‘సీమ రాజా’ కూడా వినాయక చవితికే రాబోతోంది. నిన్ననే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. అందులో వినాయక చవితి రిలీజ్ అని కన్ఫమ్ చేశారు. ఇందులో సమంత పక్కా పల్లెటూరి పిల్లగా కనిపిస్తోంది. సినిమా అంతటా ఆమె లంగా వోణీల్లోనే దర్శనమివ్వనుంది. ‘యు టర్న్’.. ‘సీమ రాజా’ పూర్తి భిన్నమైన సినిమాలు కాబట్టి క్లాష్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. మరి సమ్మర్లో మాదిరే సామ్ మరోసారి డబుల్ ధమాకా విజయాన్నందుకుంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు