హౌస్ మేట్స్ ఉక్కిరిబిక్కిరి: ఆలింగ‌నాలు.. పాదాభివంద‌నాలు

హౌస్ మేట్స్ ఉక్కిరిబిక్కిరి: ఆలింగ‌నాలు.. పాదాభివంద‌నాలు

బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఆనందం క‌ట్ట‌లు తెగింది. త‌మ క‌ళ్ల‌ను తాము న‌మ్మ‌లేక‌పోవ‌ట‌మే కాదు.. ఆనందంతో ఆత్మీయ ఆలింగ‌నాలు.. పాదాభివంద‌నాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్ప‌టివ‌ర‌కూ ఎంట‌రైన అతిధులు ఒక ఎత్తు అయితే.. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హౌస్ లోకి రావ‌టంపై విప‌రీత‌మైన ఆనందానికి గుర‌య్యారు. విశ్వ‌రూపం 2 ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్ హ‌స్ లోకి వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ కు గ్రాండ్ వెల్ కం చెప్ప‌ట‌మే కాదు.. త‌మ అభిమానంతో కాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారు.

మేం చూస్తున్న‌ది నిజ‌మేనా?  అన్నట్లుగా ఆనందంతో అరుపులు చేస్తూ.. ఏకంగా ఎగిరి గంతులు వేశారు. ఆయ‌న్ను చూస్తే చాలు అనుకునే స్థాయి నుంచి ఆయ‌న్ను తాకి త‌మ‌ను తామే మ‌ర్చిపోయారు. లోక నాయ‌కుడు మాట్లాడుతుంటే.. ఆయ‌న్నే చూస్తూ ఉండిపోయారు.

ఒక్కొక్క‌రూ త‌మ‌ను ప‌రిచ‌యం చేసుకునేందుకు త‌పించిపోయారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ హౌస్ మేట్స్ కు విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ చూపించారు. ఈ మూవీకి ప‌ని చేసిన న‌టి పూజ‌తో పాటు సాంకేతిక నిపుణులు హౌస్ లోకి వ‌చ్చారు.క‌మ‌ల్ తో త‌మ‌కున్న అనుబంధాన్ని ఎవ‌రికి వారు చెప్పుకున్నారు. మ‌హాన‌ది పాట‌ను గీతామాధురి పాడగా.. మిగిలిన వారు త‌మ గొంతును క‌లిపారు.

కౌశ‌ల్ అడ‌గ‌టంతో క‌మ‌ల్.. పైజా ఇద్ద‌రూ అదిరేటి డ్రెస్ మీరేస్తే.. పాట కోసం స్టెప్పులు వేశారు. క‌మ‌ల్ ను చూస్తూ.. మిగిలిన హౌస్ మేట్స్ ఊగిపోతే.. బాబు గోగినేని మాత్రం త‌న‌దైన రీతిలో కాస్త దూరంగా ఉండిపోయారు. క‌మ‌ల్ చుట్టూ చేరిన హౌస్ మేట్స్ కు కాస్త దూరంగా సోఫాలో కూర్చుండిపోయారు. మొత్తంగా క‌మ‌ల్ రాక‌తో బిగ్ బాస్ హౌస్ సంద‌డి సంద‌డిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు