పవన్‌ను వదిలేసి కెసిఆర్‌పై పడ్డాడు

పవన్‌ను వదిలేసి కెసిఆర్‌పై పడ్డాడు

రాష్ట్రంలో ఏ చిన్న రాజకీయ సమరం జరిగినా చాలు, అందులోకి పవన్‌ కళ్యాణ్‌ను లాగేస్తుంటాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. పవన్‌  సినిమా రిలీజ్‌ అవుతుందంటే మనోడు అవకాశాన్ని అందిపుచ్చుకొని, పవన్‌ రాజకీయాల్లోకి వస్తే చిరంజీవిని మించిపోతాడు, ఒక్క సంవత్సరం ముందు పుట్టంటే దేశంలో మరే హీరో ఎదగనంత రేంజ్‌కు ఎదిగేవాడు అని కోతలు కోస్తాడు. ఇక వర్మ పైత్యానికి పరాకాష్ట అని అనుకునే లోపు, ఒక్కోసారి నిజమైన ఎనాలసిస్‌ చెబుతూ అభిమానుల హృదయాలను కొల్లగొడతాడు. కాని తాజాగా మనోడు పవన్‌ను ప్రక్కనపెట్టేసి, టిఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌ రావుపై పడ్డాడు.

నిన్నటితో కేంద్ర క్యాబినెట్‌ కమిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర విభజనకు ఓకె చెప్పేసింది. దాంతో విస్తుచెందిన మన గురుడు, అసలు ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’ అలా ఎలా కలిసి ఉంటోంది అంటూ తన ప్రశ్నోత్తారలను సంధించడం స్టార్ట్‌ చేశాడు. వారికి విడిపోవడం చేతకావట్లేదా, లేక మనకి కలిసి ఉండటం చేతకావట్లేదా అంటూ సెటైర్లు వేస్తూ, అమెరికాలో కెసిఆర్‌ పుట్టుంటే ఎలా ఉండేది అని ట్వీట్‌ బాంబు పేల్చాడు. చూస్తుంటే, కెసిఆర్‌ అక్కడ పుడితే అక్కడ కూడా ఇలానే విభజన చిచ్చుపెట్టేవాడు అంటూ పరోక్షంగా రాము తన ఫీలింగ్స్‌ను చెప్పేసినట్లే ఉంది. ఇక కెసిఆర్‌ న్యూయార్క్‌లో పుట్టుంటే, బ్రూక్లిన్‌ బ్రిడ్జిని కూల్చేసి, న్యూయార్క్‌`న్యూజెర్సీ నగరాలను ఒక్కటి చేసేవాడని మరో పంచ్‌ వేశాడు. దీనిని మనం రివర్స్‌లోనేగా అర్ధం చేసుకోవాల్సింది? ఏది ఏమైనా మనోడు పవన్‌ను వదిలేసి ఇలా ఒక రాజకీయ నాయకుడ్ని టార్గెట్‌ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు