రామ్ చరణ్ సినిమాలో ఆర్యన్ రాజేష్

రామ్ చరణ్ సినిమాలో ఆర్యన్ రాజేష్

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. ఆయన తన ఇద్దరు కొడుకుల్నీ హీరోల్ని చేశాడు. ఐతే ముందు ఆయన దృష్టంతా పెద్దబ్బాయి ఆర్యన్ రాజేష్ మీదే నిలిచింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ‘హాయ్’ అనే సినిమా ద్వారా ఆర్యన్‌ను హీరోగా పరిచయం చేశాడాయన. ఆ సినిమా ఆడకపోయినా.. ఆ తర్వాత కూడా ఆర్యన్‌కు మంచి సినిమాలు సెట్ చేసి పెట్టాడు.

ఏం చేసినా అతను హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ‘లీలా మహల్ సెంటర్’.. ‘ఎవడి గోల వాడిది’ సినిమాలు ఆడినా రాజేష్ కెరీర్లో పెద్దగా మార్పు లేకపోయింది. వరుస ఫ్లాపులతో దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు రాజేష్. పైగా ఈవీవీ హఠాన్మరణంతో అతడి కెరీర్ గురించి ఆలోచించే వాళ్లే లేకపోయారు.

ఇక ఆర్యన్ మళ్లీ తెరపై కనిపించడం కష్టమే అనుకుంటుండగా.. అతడికి ఒక బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అతను నటిస్తున్నాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాలో ఆర్యన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇది నెగెటివ్ రోల్ అని అంటున్నారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన విలన్ గా నటిస్తుండగా.. ఆర్యన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడట.

ఇది కచ్చితంగా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని రాజేష్ ఆశిస్తున్నాడు. అతను చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘లెజెండ్’ సినిమాతో జగపతిబాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ఘనత బోయపాటిదే. ‘సరైనోడు’లోనూ శ్రీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చాడు. మరి ఆర్యన్‌ కోసం అతను ఎలాంటి పాత్ర డిజైన్ చేశాడో.. అతడి అతడి కెరీర్‌కు ఎంతమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English