‘గూఢచారి’తో 116 కనెక్షన్

‘గూఢచారి’తో 116 కనెక్షన్

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘గూఢచారి’. ఈ సినిమా టైటిల్ వినగానే అందరికీ సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గూఢచారి 116’ గుర్తుకు రాకుండా మానదు. తెలుగు సినిమా ఒక మూసలో సాగిపోతున్న సమయంలో కృష్ణ చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో ‘గూఢచారి 116’ ఒకటి. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచింది. పెద్ద హిట్టయింది. ఈ కోవలో తర్వాత మరిన్ని స్పై థ్రిల్లరు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత  ఇప్పుడు శేష్ అండ్ కో స్పై థ్రిల్లర్ ట్రై చేసింది. ఈ చిత్రానికి ‘గూఢచారి’ అనే టైటిల్ కూడా పెట్టుకుంది. ఐతే టైటిల్ అయితే పెట్టాం కానీ.. కృష్ణ సినిమాతో తమ చిత్రానికి ఏ పోలికా లేదని అంటున్నాడు శేష్. కానీ కృష్ణ సినిమాకు ట్రిబ్యూట్‌గా ఈ చిత్రంలో 116 నంబర్ కూడా వాడినట్లు చెప్పాడు.

హీరోకు ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాల్సి ఉండగా.. అది 116గానే ఫిక్స్ చేశామన్నాడు. నిజానికి ఈ చిత్రంలో కృష్ణను కూడా నటింపజేయాలని అనుకున్నామని.. ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్‌లోనే తన ఫ్లాట్ ఉంటుందని.. దీంతో ఆయన్ని వెళ్లి కలిసి ఒక పాత్ర చేయమని అడిగానని.. కానీ ఇప్పుడు తాను సినిమాలు చేయట్లేదని సున్నితంగా తిరస్కరించారని శేష్ వెల్లడించాడు. ఈ చిత్రంలో కృష్ణ మనవడైన దర్శన్ తన చిన్ననాటి పాత్ర చేసినట్లు శేష్ తెలిపాడు. ఒకసారి సుధీర్ బాబుతో మాట్లాడుతుండగా.. అతడి కొడుకును చూశానని.. అతడి హేర్ స్టైల్.. కళ్లు తన లాగే అనిపించాయని.. అందుకే అతడిని అడిగి దర్శన్‌తో తన చిన్నప్పటి పాత్ర చేయించానని.. సుధీర్ స్వయంగా తన కొడుకుని ఈ చిత్రం కోసం ట్రైన్ చేశాడని.. ‘గూఢచారి 116’కు ‘గూఢచారి’కి ఉన్న మరో కనెక్షన్ ఇదని శేష్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు