కళ్యాణ్ జువెలర్స్ గొడవపై నాగ్ క్లారిటీ

కళ్యాణ్ జువెలర్స్ గొడవపై నాగ్ క్లారిటీ

అక్కినేని నాగార్జున చాలా ఏళ్లుగా కళ్యాణ్ జువెలర్స్ బ్రాండుకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జువెలరీ బ్రాండుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ రావడంలో నాగార్జునది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఆయన్ని ముందు పెట్టి భారీగా ప్రచారం చేసింది ఆ సంస్థ. ఈ సంస్థ కోసం నాగ్ అనేక ప్రకటనల్లో నటించారు. ఐతే ఆయన చేసిన లేటెస్ట్ యాడ్ వివాదాస్పదమైంది. తెలుగు వరకే కాక హిందీలో అమితాబ్ బచ్చన్.. తమిళంలో ప్రభు చేసిన ప్రకటన కూడా వివాదానికి దారి తీసింది. అందులో బ్యాంకింగ్ సిబ్బందిని తప్పుగా చూపించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వివాదం పెద్దది కావడంతో ఆ ప్రకటనల్ని కళ్యాణ్ జువెలర్స్ వాళ్లు వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదం తాజాగా నాగార్జున సైతం స్పందించాడు.

పది రోజుల కిందట కళ్యాణ్ జువెలర్స్ వాళ్ల నుంచి తనకు ఒక లెటర్ వచ్చిందని.. ఈ యాడ్ వెనక్కి తీసుకుంటున్నామని.. ఇలాంటి ప్రకటనలో నటింపజేసినందుకు మీకు సారీ అని అందులో పేర్కొన్నారని నాగ్ వెల్లడించాడు. ఈ ప్రకటన వల్ల కొందరి మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసిందని.. ఈ విషయంలో ప్రెస్ వాళ్లు అడిగినా కూడా పొరబాటైందని చెప్పాలని కళ్యాణ్ జువెలర్స్ వాళ్లు చెప్పినట్లు పేర్కొన్నాడు నాగ్. తన కంటే ముందు అమితాబ్ బచ్చన్.. ప్రభు ఇదే ప్రకటన చేశారని.. వాళ్ల తర్వాతే తాను నటించానని.. విమర్శలకు వ్యక్తమైన పార్ట్ వరకు పక్కన పెడితే తనకు ఈ ప్రకటన చాలా నచ్చిందని.. ఇందుకోసం కొత్త అవతారంలోకి మారానని నాగ్ చెప్పాడు. ఐతే ఇలా జరగడం దురదృష్టకరమని.. ఇకపై ఇలా జరక్కుండా చూసుకుంటామని నాగ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు