‘ఆర్ఎక్స్ 100’పై నాగ్ ప్రశంసల జల్లు

‘ఆర్ఎక్స్ 100’పై నాగ్ ప్రశంసల జల్లు

ఈ మధ్య కాలంలో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘ఆర్ఎక్స్ 100’. ఐతే ఈ సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందులో రొమాన్స్ శ్రుతి మించిందని.. అమ్మాయిల్ని మరీ చెడుగా చూపించారని.. బూతులు ఎక్కువయ్యాయని.. ఇలా రకరకాల విమర్శలు కూడా వచ్చాయి.

యూత్‌ను చెడు దోవ పట్టించేలా సినిమా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రముఖ నటి మంచు లక్ష్మి సైతం ఈ సినిమాను తప్పుబడుతూ విమర్శలు చేసింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు ఊహించని మద్దతు లభించింది. అక్కినేని నాగార్జున ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. చిత్ర బృందానికి మద్దతుగా ఆయన బ్యాటింగ్ చేశాడు. తన మేనల్లుడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చి ల సౌ’ కోసం పెట్టిన ప్రెస్ మీట్లో ‘ఆర్ఎక్స్ 100’ గుురించి నాగ్ మూణ్నాలుగు నిమిషాలు మాట్లాడటం విశేషం.

‘ఆర్ఎక్స్ 100’ గురించి అందరూ చెబుతుంటే విన్నానని.. అన్నపూర్ణ స్టూడియోలో తాను వెళ్తూ ఉంటే డీఐ ల్యాబ్‌లో ఈ సినిమా చివరి రెండు రీళ్లు ఉన్నాయని.. చూడమని చెప్పారని.. దీంతో వెళ్లి చూశానని.. ఆ రెండు రీళ్లలో సినిమా అదిరిపోయిందని.. చాలా బాగా తీశారని.. రైటింగ్‌తో పాటుగా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ సూపర్ అని నాగ్ అన్నాడు. వెంటనే తనకు పూర్తి సినిమా చూడాలన్న కుతూహలం కలిగిందని.. త్వరలోనే చూస్తానని నాగ్ అన్నాడు. ఇ

దొక కొత్త జానర్ అని.. అన్ని రకాల సినిమాలూ రావాలని.. ఈ సినిమాకు ‘ఎ’ రేటింగ్ ఇచ్చారని.. అలాంటపుడు చూడాలా వద్దా అన్నది ప్రేక్షకులు నిర్ణయించుకోవచ్చని.. తన వరకైతే ఈ సినిమా చాలా ఆసక్తి రేకెత్తిస్తోందని నాగ్ అన్నాడు. కుటుంబ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూస్తున్నారని.. అలాంటపుడు ఇలాంటి సినిమాలు యూత్ చూస్తున్నారని నాగ్ చెప్పాడు. నాగ్ నుంచి ఇలాంటి సపోర్ట్ రావడం ‘ఆర్ఎక్స్ 100’ టీంకు మహదానందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు