ప్రియాంక లిప్ లాక్ వైరల్

ప్రియాంక లిప్ లాక్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేు ఈమధ్య న్యూస్ లో తెగ వినిపిస్తోంది. అమెరికన్ సింగ్ నిక్ జోనాస్ తో ప్రేమలో పడి ఇంకొద్ది రోజుల్లో అతడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ టైంలో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వాటిని పెద్దగా కరేర్ చేయడం లేదు. ఆఖరుకు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న భరత్ సినిమా చేయడానికి ముందు ఒప్పుకుని ఇప్పుడు పక్కకు తప్పుకొంది.

ఇలాంటి టైంలో ప్రియాంక చోప్రా ఓ మాంచి హాట్ కిస్ తో మళ్లీ న్యూస్ లో కనిపించింది. ఈ ముద్దు పెట్టింది రేపో మాపో పెళ్లి చేసుకువాలి అనుకుంటున్న నిక్ జోనాస్ కు కాదు. ప్రియాంకకు హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చిన క్వాంటికో సిరీస్ లో కో స్టార్ అలెన్ పావెల్ కు బ్రహ్మాండమైన లిప్ కిస్ ఇచ్చింది.  క్వాంటికో-3 సిరీస్ కోసం వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఇందులో ఓ సీన్ లో వీళ్లిద్దరి అద్భుతమైన అధర చుంబనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ముద్దు సీన్లు ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారాయి.

ప్రియాంక లిప్ లాక్ చేయడం ఇది మొదటిసారేం కాదు. క్వాంటికో-1 సిరీస్ లోనూ ముద్దులు పెట్టినా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లికి రెడీ అవుతున్న టైంలో ఈ రేంజిలో రెచ్చిపోయి నటించడమే బాలీవుడ్ జనాలను ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రియాంకకు హాలీవుడ్ లో మంచి ఛాన్సే వచ్చింది. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ హీరో క్రిస్ ప్రాట్ తో కలిసి హీరోయిన్ గా నటించబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English