ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫైటింగ్

ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫైటింగ్

కొద్ది వారాలుగా బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోతున్నాయి. విడుదలకు ముందే బజ్ లేకపోవడం.. ముందుగా ఎక్స్ పెక్ట్ చేసిన విధంగా ఆ సినిమాల్లో పెద్దగా దమ్ము లేకపోవడంతో సినిమా హాళ్లు డల్లుగానే కనిపిస్తున్నాయి. ఈవారం మాత్రం రిలీజ్ కు ముందు మంచి బజ్ సంపాదించుకున్న సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి.

ఈవారం రిలీజవుతున్న వాటిలో అడవి శేష్ హీరోగా నటించిన గూఢచారి.. సుశాంత్ హీరోగా నటిస్తున్న చి.ల.సౌ. సినిమాలు ట్రయిలర్ల పరంగా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. చి.ల.సౌ. సినిమాతో  యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ అవతారమెత్తాడు. అడవి శేష్ కూడా క్షణం తరవాత మళ్లీ తన కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వాస్తవానికి రాహుల్ అండ్ అడవి శేష్ మంచి ఫ్రెండ్స్. అనుకోకుండానే ఈవారం సినిమా రేసులో ఇద్దరూ పోటాపోటీగా బాక్సాఫీస్ దగ్గర ఫైటింగ్ కు దిగుతున్నారు.

రాహుల్ - అడవి శేష్ ఇద్దరూ బోలెండత కష్టనష్టాలు పడ్డాకే తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం చి.ల.సౌ. అండ్ గూఢచారి టీంలు తమ సినిమాలను జోరుగా ప్రమోట్ చేస్తున్నాయి. వీళ్లిద్దరికి అక్కినేని ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ నుంచి కామన్ గా సపోర్ట్ లభిస్తోంది. గూఢచారి సినిమాలో నాగార్జున మేనకోడలు... పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ సుప్రియ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. మరోవైపు చి.ల.సౌ. హీరో సుశాంత్ నాగార్జున మేనల్లుడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English