వావ్!! శంకర్ పాతికేళ్ల ప్రయాణం

వావ్!! శంకర్ పాతికేళ్ల ప్రయాణం

డైరెక్టర్ శంకర్.. టాలీవుడ్ - కోలీవుడ్ లలో పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ లో తీసింది తక్కువ సినిమాలే అయినా వాటిలో అత్యధికం బ్లాక్ బస్టర్లే. భారీ బడ్జెట్ తో సినిమా తీయడం.. పెట్టిన ఖర్చుకు రెండింతల లాభం తెచ్చేలా హిట్ కొట్టడం శంకర్ కు అలవాటే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ తమిళంలో తీసినవే అయినా తెలుగులోకి డబ్ అవుతుంటాయి. తమిళంతో సమానమైన హిట్ సాధిస్తాయి.

ఇంత ఘన చరిత్రగల శంకర్ దర్శకుడిగా మార్చి ఇప్పటికి పాతికేళ్లయింది. 1993 జులై 30న అతడు డైరెక్ట్ చేసిన మొదటి మూవీ జంటిల్ మేన్ రిలీజయింది. ఈ సినిమాతోనే అతడి సత్తా ఇండస్ట్రీకి అర్ధమైపోయింది. జంటిల్ మేన్ రిలీజయి సిల్వర్ జూబ్లీ పూర్తయిన సందర్భంగా శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్లంతా ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. శంకర్ శిష్యుల్లో బాలాజీ శక్తివేల్.. వసంత బాలన్.. అట్లీ లాంటివాళ్లంతా దర్శకులిగా మంచి సక్సెస్ సాధించారు. తన శిష్యులంతా తనకోసం ఒకచోటికొచ్చి తనను సన్మానించడంతో శంకర్ ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. ‘‘నా అసిస్టెంట్లు నాపై చూపిన అభిమానం నన్నెంతో కదిలించి వేసింది. వాళ్లంతా లేకుండా నా విజయాలు సాధ్యమయ్యేవి కాదు’’ అంటూ తన ట్విట్టర్ లో ఆనందాన్ని పంచుకున్నాడు.

శంకర్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీని తరవాత భారతీయుడు-2 సినిమా డైరెక్ట్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English