నెక్ట్స్ లెవెల్ కి వెళ్తోంది

నెక్ట్స్ లెవెల్ కి వెళ్తోంది

బాలీవుడ్ చాలా రోజులుగా గుర్తింపు కోసం స్ట్రగుల్ అవుతోంది కియారా అద్వానీ. క్రికెటర్ ఎం.ఎస్.ధోని బయోపిక్ తో కియారా పేరు ప్రేక్షకులకు పరిచయమైంది కానీ ఆమె కోరుకున్న బ్రేక్ రాలేదు. అలాంటి టైంలో టాలీవుడ్ లో హీరో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా భరత్ అనే నేను సినిమాలో అవకాశం దక్కించుకుంది. అందులో సీఎం గర్ల్ ఫ్రెండ్ గా కియారా నటనకు మంచి పేరే వచ్చింది.

టాలీవుడ్ లో అడుగుపెట్టిన వేళ కియారాకు కలిసొచ్చింది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ మూవీ లస్ట్ స్టోరీస్ తో కియారా పేరు మార్మోగిపోతోంది. అందులో వైబ్రేటర్ వాడిన సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు బాలీవుడ్ జనాలంతా ఫిదా అయిపోయారు. దీంతో స్టార్ రేంజి గుర్తింపు ఒక్కసారిగా వచ్చేసింది కియారాకు. అందుకే ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ముంబయిలోని తన ఫ్రెండ్స్ కు.. సినిమా జనాలకు అదిరిపోయే పార్టీ ఇచ్చింది.  ఇప్పటివరకు నటిగా వచ్చిన సక్సెస్ ను సోలోగానో.. ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తూ వచ్చిన కియారా ఈ బర్త్ డే పార్టీతో తాను నెక్ట్స్ లెవెల్ కి వెళ్లాననే మాట చెప్పకుండానే చెప్పినట్లయింది.

ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో కరణ్ జోహార్ - సాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కళంక్ లో ఓ స్పెషల్ లో సాంగ్ చేసింది. లస్ట్ స్టోరీస్ తరవాత కియారాకు ఆఫర్లు బాగానే వస్తున్నాయనేది బాలీవుడ్ టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు