పిక్ టాక్: స్టార్ డాటర్ ఎంట్రీ అదిరే

పిక్ టాక్: స్టార్ డాటర్ ఎంట్రీ అదిరే

బాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల ట్రెండ్ నడుస్తోంది. హీరోల విషయంలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కానీ హీరోయిన్లుగా మాత్రం వారసులు దుమ్ము దులిపేస్తున్నారు. ముఖ్యంగా టాప్ హీరోల కుమార్తెలు సైతం హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ ఆరాట పడుతున్నారు. సోనాక్షి సిన్హా.. శ్రద్ధ కపూర్.. ఆలియా భట్.. ఇలా ఇప్పుడు టాప్ రేసులో ఉన్నవాళ్లలో ఎక్కువమంది వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే.

తాజాగా అందాల తార శ్రీదేవి జాన్వి కపూర్ సైతం తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ అరంగేట్రం చేసింది. ఆమె నటించిన ధడక్ సినిమా బాక్సాఫీస్ ను బాగానే ఆకట్టుకుంటోంది. జాన్వి బాటలోనే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహాన్ ఖాన్ సినిమాల్లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది. షారుఖ్ కూడా తన కుమార్తెకు హీరోయిన్ అవ్వాలని ఉందనే విషయం చెప్పేశాడు. ఎంతయినా స్టార్ డాటర్.. కాబోయే హీరోయిన్ కావడంతో సుహానా అప్పుడే పాపులర్ మ్యాగజైన్ ఓగ్ కవర్ పేజీపై చోటు సంపాదించేసింది.

గ్లామర్ ప్రపంచంలో రాణించడానికి కావాల్సిన అన్ని క్వాలిటీలు సుహానాలో పుష్కలంగా ఉన్నాయనే విషయం ఆమె స్టిల్ చూస్తేనే తెలుస్తుంది. సుహానా కవర్ పేజీ స్టిల్ ను తన ట్విట్టర్ టైమ్ లోనే షారూఖ్ స్వయంగా షేర్ చేశాడు. మళ్లీ ఓసారి సుహానాను నా చేతులపైకి వచ్చిందంటూ కామెంట్ పెట్టాడు. పిల్లలకు పంచేది అంతులేని ప్రేమేనంటూ తన పితృప్రేమనంతా మాటల్లో కుమ్మరించి ఆనందాన్ని పంచుకున్నాడు. సో.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకో స్టార్ డాటర్ రెడీ అయినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English