సల్మాన్‌కు ప్రియాంక టాటా.. కొత్త ట్విస్ట్

సల్మాన్‌కు ప్రియాంక టాటా.. కొత్త ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ నుంచి తప్పుకోవడం ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో నిశ్చితార్థం చేసుకున్న ప్రియాంక.. త్వరలోనే అతడితో పెళ్లికి సిద్ధమవుతోందని.. ఈ నేపథ్యంలోనే ‘భారత్’ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మీడియాలో వార్తలొచ్చాయి.

‘భారత్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కూడా ఈ రకమైన సంకేతాలే ఇచ్చాడు. ప్రియాంకకు విషెస్ చెప్పాడు. కానీ ఈ చిత్ర నిర్మాత మాత్రం ప్రియాంక మీద మండిపడ్డాడు. ప్రియాంక అన్ ప్రొఫెషనల్ అన్నాడు. ప్రియాంక కేవలం పెళ్లి కోసమే ఈ సినిమా నుంచి తప్పుకోవట్లేదని తెలిసే ఆయన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి కోసం ప్రియాంక పూర్తిగా సినిమాలు మానేస్తోందన్న ప్రచారమే అబద్ధం అంటున్నారు.

కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొంత విరామం తర్వాత ‘భారత్’ సినిమాతో పాటు ‘ది స్కై ఈజ్..’ అనే మరో సినిమా కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడామె ‘భారత్’ నుంచి మాత్రమే తప్పుకుని.. ఇంకో సినిమాలో కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే ‘భారత్’ నుంచి తప్పుకోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సల్మాన్ సినిమాలంటే హీరోయిన్లకు అసలేమీ పాత్ర ఉండదు. ‘భారత్’లోనూ అంతేనట. అందుకే ప్రియాంక పెళ్లి పేరు చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 16న తన ప్రియుడు నిక్ పుట్టిన రోజునే అతడిని పెళ్లాడాలని ప్రియాంక నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. పెళ్లి తర్వాత ఆమె హాలీవుడ్లో ఒక భారీ సినిమాలో నటించబోతోందట. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ దర్శకుడు మిషెల్ మెక్ లారెన్ దర్శకత్వంలో ఆమె నటిస్తుందట. ‘భారత్’కు టాటా చెప్పేయడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English