సమంత లవ్ అట్ ఫస్ట్ సైట్.. నమ్మొచ్చా?

సమంత లవ్ అట్ ఫస్ట్ సైట్.. నమ్మొచ్చా?

అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. ఐతే పెళ్లి తర్వాత తన గత జీవితం గురించి మాట్లాడటానికి ఆమె ఏమాత్రం మొహమాట పడలేదు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ‘మహానటి’లో సావిత్రి జీవితంతో తన లైఫ్‌ను పోల్చుకుందామె. తాను కూడా ఒకప్పుడు ఒక రిలేషన్షిప్‌లోకి వెళ్లానని.. అందులో కొనసాగి ఉంటే సావిత్రి జీవితం లాగే తనదీ తయారయ్యేదని.. అదృష్టవశాత్తూ దాన్నుంచి త్వరగానే బయటికి వచ్చేశానని ఆమె చెప్పింది.

ఇక్కడ ఆమె ప్రస్తావించింది సిద్దార్థ్‌తో కొన్నాళ్ల పాటు సాగిన ప్రేమాయణం గురించే అన్నది స్పష్టం. సిద్ధుతో తాను ప్రేమలో ఉన్న సంగతి ఆ సమయంలో సమంత దాచడానికి కూడా ప్రయత్నించలేదు. బ్రేకప్ అయినపుడు కూడా ఒక పత్రికలో కథనం వస్తే దాని గురించి ఆమె స్పందించింది.

కట్ చేస్తే.. ‘చి ల సౌ’కు సంబంధించిన ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం గురించి మాట్లాడింది సామ్. అతడితో తనది లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఆమె చెప్పింది. కానీ సిద్దార్థ్ వ్యవహారం గురించి అంతా ఓపెన్ అయ్యాక ఆమె ఈ మాట అనేసరికి సోషల్ మీడియాలో జనాలు ఊరుకుంటారా? ఆమె ఇంతకుముందు కూడా ఒకసారి ‘ఏమాయ చేసావె’ దగ్గరే తమ మధ్య బంధం మొదలైందని అంటే జనాలు మధ్యలో సిద్ధు టాపిక్ తీసుకొచ్చి ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

అయినా ఈ విషయంలో సమంత ఎప్పుడూ దాపరికం పాటించింది లేదు. ఓపెన్‌గానే ఉంటూ వచ్చింది. అలాంటపుడు మళ్లీ వెనక్కి వెళ్లి లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే అనవసర చర్చకు తావిచ్చినట్లు ఉంటుంది. ఈ రోజుల్లో ఏ చిన్న పాయింట్ దొరికినా సోషల్ మీడియాలో జనాలు చెలరేగిపోతారు. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు