అరవింద సమేత.. డెడ్ లైన్ ఫిక్స్

అరవింద సమేత.. డెడ్ లైన్ ఫిక్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అంటే ఒక పట్టాన తెగదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఒకట్రెండు సినిమాల్ని మినహాయిస్తే త్రివిక్రమ్ చిత్రాల్లో చాలా వరకు నెమ్మదిగా చిత్రీకరణ జరుపుకున్నవే. అనుకున్నదానికంటే ఆలస్యంగా పూర్తయినవే.

త్రివిక్రమ్ చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’ని కూడా ముందు దసరాకు అనుకుని.. అనుకున్న ప్రకారం పూర్తి చేయలేక సంక్రాంతికి వాయిదా వేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘అరవింద సమేత’ విషయంలోనూ ఇలాగే జరుగుతుందేమో అనుకున్నారు చాలామంది. ఈ చిత్రం అనుకున్న సమయానికి మొదలు కూడా కాలేదు. దీంతో వచ్చే ఏడాదే రిలీజ్ అని ఫిక్సయిపోయారు జనాలు. కానీ ఒక్కసారి షూటింగ్ మొదలయ్యాక మాత్రం త్రివిక్రమ్-ఎన్టీఆర్ సూపర్ స్పీడు చూపిస్తున్నారు.

చకచకా చిత్రీకరణ అయిపోతోంది. ఇప్పటికే నాలుగింట మూడొంతుల షూటింగ్ ముగిసినట్లు సమాచారం. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి త్రివిక్రమ్ అండ్ కో  ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుందట. సెప్టెంబరు 15కు సినిమాను పూర్తి చేయనున్నారట. చిత్రంలోని ప్రధాన నటీనటుల డేట్లు కూడా అప్పటి వరకే తీసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటికి చిత్రీకరణ ముగించాలని పట్టుదలతో ఉంది చిత్ర బృందం.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ అయ్యాక మిగతా నాలుగు వారాల్లో పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ కానిచ్చి సినిమాను అనుకున్నట్లుగా దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి అంతా అనుకున్న ప్రకారమే జరుగుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు