కొరటాల-ఎన్టీఆర్ ఎప్పుడంటే..?

కొరటాల-ఎన్టీఆర్ ఎప్పుడంటే..?

దర్శకుడు కొరటాల శివ కంటే హీరో జూనియర్ ఎన్టీఆర్ చిన్నవాడు. అయినప్పటికీ అతడిని అన్నయ్య అని పిలుస్తాడు కొరటాల. ఇందుకు ఎన్టీఆర్ మీద ఉన్న కృతజ్ఞత భావమే కారణం. కొరటాల రచయితగా కష్టాలు పడుతున్నపుడు ఎన్టీఆరే ఆదుకున్నాడు. తన ‘బృందావనం’తో పాటు వేరే ప్రాజెక్టుల్లోనూ అవకాశం ఇప్పించాడు. అందుకే ఎన్టీఆర్‌ను అన్నయ్య అని పిలుస్తూ ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడు కొరటాల. దర్శకుడిగా తన మూడో సినిమా ‘జనతా గ్యారేజ్’ను ఎన్టీఆర్‌తో్నే చేశాడు కొరటాల. అది తారక్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని ఇంతకుముందే ప్రకటన వచ్చింది. కానీ అదెప్పుడు ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోయింది.

ఇటీవలే ‘భరత్ అనే నేను’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న కొరటాల.. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్తుంది. మరోవైపు ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ పూర్తి చేసి.. రాజమౌళి మల్టీస్టారర్లోకి వెళ్లనున్నాడు. మరి కొరటాల-తారక్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడనే విషయంలో స్పష్టత లేదు. ఐతే కొరటాల సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో మొదలవుతుందట. చిరు సినిమాను పూర్తి చేసి.. ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టు మీద పని చేయనున్నాడట కొరటాల. రాజమౌళితో సినిమా అంటే అంత సులువుగా తెగే వ్యవహారం కాదు. ఎన్టీఆర్ కచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు. కొరటాల మాత్రం వచ్చే ఏడాది చివరికి ఈ చిత్రాన్ని మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాడట. కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు