హైదరాబాదీ బయోపిక్‌కు తాప్సి రెడీ

హైదరాబాదీ బయోపిక్‌కు తాప్సి రెడీ

టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్‌లలోనూ బయోపిక్‌ల హవా నడుస్తోందిప్పుడు. బాలీవుడ్లో ముందు నుంచి బయోపిక్స్ వస్తున్నాయి కానీ.. దక్షిణాదిన ఈ మధ్యే వీటి జోరు మొదలైంది. ‘మహానటి’ తర్వాత ఒక్కసారిగా ఈ జానర్ ఊపందుకుంది. దక్షిణాదికి చెందిన స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్స్ కూడా వరుసగా తెరమీదికి వస్తున్నాయి. త్వరలోనే గోపీచంద్ బయోపిక్ మొదలు కాబోతుండగా.. సానియా, సైనా, సింధుల బయోపిక్స్ గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. ఈలోపే మిథాలీ రాజ్ జీవిత కథపై సినిమా కూడా తెరమీదికి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మిథాలీ బయోపిక్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఆల్రెడీ మిథాలీ నుంచి అనుమతి తీసుకుని.. స్క్రిప్టు పనులు మొదలుపెట్టేసింది.

ఈ చిత్రంలో సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను కథానాయికగా నటిస్తుందంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతో కానీ.. మీడియా వాళ్లు ఈ విషయం అడిగితే మాత్రం తాప్సి సానుకూలంగా స్పందించింది. మిథాలీ బయోపిక్‌లో తాను నటించడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ సినిమా కోసం తనను అడిగారా లేదా అనే విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ కాలేదని.. ప్రస్తుతం సమాచార సేకరణ జరుగుతోందని అప్ డేట్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే చర్చలు జరుగుతున్నట్లే తెలుస్తోంది. ‘‘ఆ పాత్ర కోసం నన్ను అడిగితే చాలా సంతోషిస్తా. నేను స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఎదురు చూస్తున్నా’’ అని తాప్సి చెప్పింది. టాలీవుడ్లో గ్లామర్ రోల్స్ చేసిన తాప్సి.. బాలీవుడ్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లతో మంచి పేరే సంపాదించింది. ప్రస్తుతం ఆమె రిషి కపూర్‌తో కలిసినటించిన ‘ముల్క్’ విడుదలకు సిద్ధంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English