నితిన్ సినిమాలోకి ఆమె ఎలా వచ్చింది?

నితిన్ సినిమాలోకి ఆమె ఎలా వచ్చింది?

కెరీర్ ఆరంభం నుంచి చిన్నా చితకా సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది పూనమ్ కౌర్. చాలా ఏళ్ల కిందటే ఆమెకు సినిమా అవకాశాలు ఆగిపోయాయి. ఈపాటికి జనాలు ఆమెను పూర్తిగా మరిచిపోయి ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ పేరుతో పూనమ్ పేరు ముడిపడటంతో పూనమ్ ఇంకా లైమ్ లైట్లోనే ఉంది.

నిజానికి ఎన్నో ఏళ్లు సినిమాల్లో కొనసాగినపుడు కూడా రాని ప్రచారం ఆమెకు గత కొన్ని నెలల్లో వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఆమె బంధంపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి ఈ మధ్య. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత వస్త్ర ప్రచారకర్త కావడానికి.. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్లో ప్రధాన పాత్రకు ఎంపిక కావడానికి తెర వెనుక కారణాలేవో ఉన్నాయని ముందు నుంచే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే పూనమ్‌కు సినిమాల్లో మాత్రం అవకాశాలు రావట్లేదే అనుకుంటుండగా.. ఒక క్రేజీ ప్రాజెక్టులో ఆమెకు అవకాశం దక్కడం ఆసక్తి రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’లో పూనమ్ ఓ కీలక పాత్ర పోషించింది. తాజాగా రిలీజ్ చేసిన పెళ్లి పాట మేకింగ్ వీడియోలో పూనమ్ తళుక్కుమంది. ఆమె వీడియో మధ్యలో వాయిస్ కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్ సినిమాలో పూనమ్ కనిపించేసరికి అందరికీ రకరకాల సందేహాలొస్తున్నాయి.

యాదృచ్ఛికంగానే ఆమెకు ఈ సినిమాలో అవకాశం దక్కిందా.. లేక దీని వెనుక పవన్ కానీ.. నితిన్ కానీ ఉన్నారా అన్న డిస్కషన్ మొదలైంది. దిల్ రాజుకు పవన్ మీద ప్రత్యేక అభిమానముంది. అతడితో సినిమా చేయాలన్నది తన జీవిత లక్ష్యం అన్నట్లుగా చెప్పుకున్నాడు రాజు ఒక టైంలో. ఈ నేపథ్యంలో నితిన్ సిఫారసుతో రాజు ఆమెకు తన సినిమాలో అవకాశమిచ్చాడేమో అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు