పిక్ టాక్ : టీవీ స్టారయినా తగ్గట్లేదుగా

పిక్ టాక్ : టీవీ స్టారయినా తగ్గట్లేదుగా

ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టే హీరోయిన్లతోపాటు అల్రెడీ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు ఫొటో షూట్లు చేస్తూ ఉంటారు. వాళ్లో ఉన్న హాట్ యాంగిల్.. సెక్సప్పీల్ ను గ్లామర్ ప్రపంచానికి పరిచయం చేసేలానే అత్యధికం ఫొటో షూట్లు వస్తుంటాయి. బాలీవుడ్ లో దిశా పఠానీ.. హార్ట్ అటాక్ ఫేం అదా శర్మ లాంటి వాళ్లంతా సినిమాల కంటే ఈ ఫొటో షూట్లతో ఎక్కువ న్యూస్ లో కనిపిస్తుంటారు.

ఇవ్వాళ రేపు టీవీ, సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు. ఇప్పుడు గ్లామర్ కంటెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో టీవీలు సినిమాలను మించిపోతున్నాయి. అందుకే టీవీలో పాపులరయిన అందాల భామలు సైతం హాట్ హాట్ ఫోజులతో ఫొటో షూట్లకు రెడీ అయిపోతున్నారు.  స్టార్ ప్లస్ లో వచ్చిన సిల్ సిలా ప్యార్ కా.. సోనీ టీవీలో ఆహత్ వంటి సీరియళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కరిష్మ శర్మ ఇదే స్టయిల్ లో ముందుకెళుతోంది. తాజాగా కరిష్మ శర్మ చేసిన ఓ ఫొటో షూట్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఉంది.

రెడ్ కలర్ డ్రస్ పై ఎల్లో ఇన్నర్ వేర్ తో కరిష్మ శర్మ ఇచ్చిన ఫోజులు చూస్తే ఈమెలో ఇంత బ్యూటీ దాగుందా అనే డౌట్ రాకుండా పోదు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కరిష్మ శర్మ పెట్టిన ఫొటోలు నెటిజన్లను తెగు ఆకట్టుకుంటున్నాయి. ఆమెకు వేలల్లో లైకులు.. కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అమ్మడి అందం చూసి రేపోమాపో సినిమా ఛాన్సు వరించినా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు