తమిళంలోకి పవన్ బ్లాక్ బస్టర్

తమిళంలోకి పవన్ బ్లాక్ బస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ నే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరైన హిట్ పడితే పవన్ ఏ స్థాయి కలెక్షన్లు సాధించగలడో ఈ మూవీ ప్రూవ్ చేసింది.

బ్లాక్ బస్టర్ మూవీని అత్తారింటికి దారేది ఇప్పుడు తమిళంలో రాబోతోంది. అలాగని ఈ సినిమాను డబ్బింగ్ చేయడం లేదు. దీనిని కోలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్కడ అతి పెద్ద ప్రొడక్షన్ హౌసుల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది రీమేక్ రైట్స్ దక్కించుకుంది. ఈ మూవీ మొత్తం హీరో స్టామినా మీదే ఆధారపడి నడుస్తుంది. కాబట్టి గ్యారంటీగా అక్కడ స్టార్ హీరోలే ఈ రోల్ చేయాల్సి ఉంటుంది. రైట్స్ దక్కించుకుంది 2.0 లాంటి అతి భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కాబట్టి ఈ సినిమా కూడా భారీ ఖర్చుతోనే తీసే అవకాశం ఉంది. ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటించేది ఇంకా క్లారిటీ రాలేదు.

అత్తారింటికి దారేది మూవీని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేశారు. ‘ఈగ’ సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే కిచ్చా సుదీప్ ఈ సినిమా చేశాడు. రన్న పేరుతో వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి హిట్ కొట్టింది. హీరో అత్తగా తెలుగు నదియా చేసిన పాత్రను బాలీవుడ్ హీరోయిన్ మధుబాల చేసింది. ఇక తమిళంలో ఈ రోల్ ఎవరు చేయబోతున్నారో.. లెట్స్ వెయిట్ అండ్ సీ!!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English