లిప్ లాక్ లకు కత్తెర పడలేదు

లిప్ లాక్ లకు కత్తెర పడలేదు

ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి స్పై థ్రిల్లర్స్. అందుకే బ్లాక్ అండ్ వైట్ రీల్ కాలం నుంచి డిజిటల్ సినిమా వరకు జేమ్స్ బాండ్ సినిమాలకు తరగని ఆదరణ ఉంటుంది. జేమ్స్ బాండ్ స్ఫూర్తితో తెలుగులోనూ గూఢచారి సినిమాలు వచ్చాయి. ప్రజంట్ జనరేషన్ లో మాత్రం ఈ జోనర్ లో సినిమాలు పెద్దగా రాలేదు.  సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం మూవీతో సోలో హీరోగా హిట్ కొట్టిన అడవి శేష్ గూఢచారిగా ఆగస్టు 3న థియేటర్లను రానున్నాడు.

గూఢచారి సినిమాలన్నింటిలో ఉండే కామన్ పాయింట్ ఏమిటంటే హీరో సాహసాలు.. హీరోయిన్లతో సరసాలు. అందుకే అడవి శేష్ తన గూఢచారి సినిమాలో ఈ పాయింట్ మిస్ చేయలేదు. ఈ మూవీలో హీరోయిన్ గా మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇందులో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు ఉన్నాయనే విషయం ట్రయిలర్ లోనే చూపించేశారు. మరి ఈ సీన్లు సినిమాలో ఉన్నాయా.. సెన్సార్ కత్తెరకు దొరికిపోయాయా అని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు డౌట్ పట్టుకుంది.

కానీ గూఢచారి సినిమాలో లిప్ లాక్ సీన్లకు ఎలాంటి కోత పడలేదు. సెన్సార్ ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో శోభిత హార్వర్డ్ నుంచి వచ్చిన సైకాలజిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. వెండితెరపై గ్లామర్ చూపించడంలోనూ శోభిత ఏ మాత్రం మొహమాట పడలేదనే విషయం స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈరకంగా హీరోయిన్ తో సరసాల వరకు క్లారిటీ వచ్చేసింది.. హీరో సాహసాలు ఏ రేంజిలో ఉంటాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు