తేజస్వి చేసిన కంపుతో నానికి తలపోటు

తేజస్వి చేసిన కంపుతో నానికి తలపోటు

బిగ్‌ బాస్‌ అంటే అవతలి వారిని బెదరగొట్టి పంపించేయడం, వారిపై బురద జల్లి ప్రజల దృష్టిలో విలన్లని చేయడమేనని తేజస్వి భావించింది. ఆ హౌస్‌లో అడుగు పెట్టింది లగాయతు ఆమె అదే గేమ్‌ ఆడుతూ వచ్చింది. ముందుగా ఒక గ్రూప్‌ని ఫార్మ్‌ చేసి అవతలి వారిపై దాడి మొదలు పెట్టింది. దీంతో కౌశల్‌ అనే టీవీ యాక్టర్‌కి పబ్లిక్‌ సపోర్ట్‌ దక్కింది. ప్రస్తుతం అతని ఫాలోయింగ్‌ స్టార్‌ హీరోలకి తీసిపోని విధంగా వుంది. అతడిని ఎవరేమన్నా అభిమానులు ఎగబడిపోతున్నారు. కౌశల్‌ని టార్గెట్‌ చేస్తోన్న హౌస్‌మేట్స్‌ని ఏమీ అనకపోతే హోస్ట్‌ నానిని తిడుతున్నారు.

అలాగే కౌశల్‌ని మందలించినా కానీ నానిని ట్రాల్‌ చేస్తున్నారు. హౌస్‌లో ఎవరు వుండాలి, ఎవరు వెళ్లిపోవాలి అనేది కూడా తమ ఓట్లతో డిసైడ్‌ చేస్తోన్న కౌశల్‌ సేన ఈ షో స్వరూపాన్నే మార్చేసింది. బిగ్‌ బాస్‌ అనుకున్న విధంగా షో రన్‌ అవడం లేదు. వాళ్లు కావాలని అనుకున్న కంటెస్టెంట్స్‌ ఇప్పుడు హౌస్‌లో మిగలడం లేదు. ఫైనల్స్‌కి వెళ్లే సరికి స్ట్రాంగ్‌ అనుకున్న వాళ్లంతా పోయి వీక్‌ ప్లేయర్లు మిగిలేలా వున్నారు. తేజస్విపై పెల్లుబికిన ఆగ్రహానికి తోడు ఆమె ప్రభావంతో గేమ్‌ ఆడుతోన్న వారంతా వరుసగా ఎలిమినేట్‌ అవుతున్నారు.

ఈ షోని మళ్లీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడమెలా అనేది బిగ్‌బాస్‌కి అంతుచిక్కడం లేదు. ఒకవేళ కౌశల్‌ని ఏదో రకంగా పంపించేస్తే మొత్తానికి టీఆర్పీకే హోల్‌ పడడమే కాకుండా బిగ్‌బాస్‌ నిర్వహణపైనే పర్మినెంట్‌ మరక పడేలా వుంది. ఒక్క ప్లేయర్‌ చేసిన అతి వల్ల షో మొత్తం భ్రష్టు పట్టిపోయి కంట్రోల్‌లోంచి పోవడం ఇప్పుడు బిగ్‌బాస్‌తో పాటు నానిని కూడా చాలా ఇబ్బంది పెడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు