కాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటోన్న వరుణ్‌తేజ్‌ హీరోయిన్‌

కాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటోన్న వరుణ్‌తేజ్‌ హీరోయిన్‌

ఇటీవలే సమ్మోహనం చిత్రంతో సమ్మోహన పరచిన అదితి రావు హైదరి ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో స్పేస్‌ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఘాజీ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే వున్నాయి. ఇదిలావుంటే ఇటీవల సినీ పరిశ్రమలో హాట్‌గా నానుతోన్న 'కాస్టింగ్‌ కౌచ్‌' ఇష్యూపై అదితి కూడా స్పందించింది. తనకి కూడా అలాంటి అనుభవం ఎదురైందని ఆమె అంగీకరించింది. ఎవరనేది పేరు చెప్పకపోయినా అవకాశం ఇవ్వడానికి కాంప్రమైజ్‌ కావాలని డిమాండ్‌ చేసారని, అయితే ఖాళీగా అయినా కూర్చోవడానికి సిద్ధపడ్డానే తప్ప వాళ్ల డిమాండ్లకి తలొగ్గలేదని, కాస్త ఆలస్యంగా అయినా తన టాలెంట్‌ని గుర్తించి అవకాశాలు ఇస్తున్నారని అదితి చెప్పింది.

అయితే అదితి హీరోయిన్‌గా కెరియర్‌ స్టార్ట్‌ చేసింది బాలీవుడ్‌లో కనుక తనకి ఇలాంటి అనుభవం అక్కడే ఎదురైందని అనుకోవచ్చు. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో చాలా మంది పరిశ్రమకి మకిలిగా మారిపోయిన ఈ సమస్యపై ఇప్పటికే స్పందించారు. చిన్నా చితకా నటీమణులు గుర్తింపు కోసం చేస్తోన్న గోలగా దీనిని చూడకుండా సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేలా భారతీయ చిత్ర పరిశ్రమ ముందడుగేస్తే మంచిదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు