చైతన్య చేతిలోనే మెగా హీరోయిన్‌ ఫ్యూచర్‌

చైతన్య చేతిలోనే మెగా హీరోయిన్‌ ఫ్యూచర్‌

హీరోయిన్‌గా పరిచయమైన కొద్ది రోజుల్లోనే పవన్‌కళ్యాణ్‌ సరసన అజ్ఞాతవాసిలో జత కట్టిన అను ఎమాన్యుయేల్‌కి వెంటనే అల్లు అర్జున్‌ చిత్రంలోను అవకాశం దక్కింది. వరుసగా అజ్ఞాతవాసి, నా పేరు సూర్యలో ఛాన్స్‌లు దక్కించుకుని మెగా హీరోయిన్‌ అనిపించేసుకున్న అను ఎమాన్యుయేల్‌కి అదృష్టం కలిసి రాలేదు. ఆ రెండు చిత్రాలు ఫ్లాప్‌ అవడంతో అను బిజీ కాలేదు. అవి విడుదల కాకముందే నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకుంది అను. యావరేజ్‌ అయిన మజ్ను మినహా తను నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌ అవడంతో ఇప్పటికే అనుపై ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర పడింది. 'శైలజారెడ్డి అల్లుడు' కనుక ఆ బ్రాండ్‌ తొలగిస్తే మళ్లీ అను ఎమాన్యుయేల్‌కి అవకాశాలు వస్తాయి.

రీసెంట్‌గా రవితేజ చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' నుంచి అనుని తొలగించిన సంగతి తెలిసిందే. చైతన్య చిత్రం మీదే ఇప్పుడు తన ఆశలన్నీ పెట్టుకుంది. అమెరికా నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్న అను ఎమాన్యుయేల్‌కి ఈ చిత్రంతో సక్సెస్‌ రానట్టయితే మళ్లీ తిరిగి యుఎస్‌ వెళ్లిపోవాల్సి వుంటుంది. ఎన్నారై హీరోయిన్‌ పార్వతి మెల్టన్‌లా అలా మెరిసి మాయమవుతుందా లేక మళ్లీ ఎగసి కొన్నాళ్లు ఏలుతుందా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు